ఒక సినిమా విడుదల అయింది అంటే ఖచ్చితంగా మరో సినిమాను ఆగమేఘాల మీద ప్రకటించేయడం దర్శకుడు త్రివిక్రమ్ కి( Director Trivikram ) ఉన్న అలవాటు.నిన్న మొన్న గుంటూరు కారం( Guntur Karam ) విడుదల అయిందో లేదో దాని తర్వాత ఆయన కెరియర్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ తన సినిమా గురించి అనౌన్స్మెంట్ చేసేయాలి.పూజా కార్యక్రమాలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు కానీ గుంటూరు కారం లెక్కలు త్రివిక్రమ్ ని కాస్త ఆలోచించ ఆలోచించేలా చేశాయని ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ఇప్పటికే అల్లు అర్జున్ తో( Allu Arjun ) తన తరపున సినిమా ఉండబోతుంది అంటూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు త్రివిక్రమ్ కానీ ఇది గతంలోని విషయం.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.దీని తర్వాత పుష్ప 3( Pushpa 3 ) కూడా ఉండబోతుందని సమాచారం.ఇవి కాకుండా ఇప్పటికే అట్లీ( Atlee ) సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్.ఈ మొత్తం సినిమాలు పూర్తి అవడానికి దాదాపు రెండు మూడు ఏళ్లు సమయం పట్టొచ్చు.
మరి ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ తో సినిమా అంటే త్రివిక్రమ్ వేచి చూడాల్సి వస్తుంది.అంత సమయం వేచి చూస్తారా లేదా మరో చిత్రం కమిట్ అవుతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే అందుతున్న సమాచారం మేరకు నాని మరియు వెంకటేష్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్ మూవీ చేయాలి త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది.అందులో నిజా నిజాలు ఏంటో తెలియదు కానీ ఇప్పటి వరకు వెంకటేష్( Venkatesh ) హీరోగా ఉన్న సినిమాలకు రైటర్ గా త్రివిక్రమ్ పని చేశాడు.
అలాగే నానితో( Nani ) కూడా చాలా రోజులుగా ఒక కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు.ఇదే వర్క్ అవుట్ అయితే చాలా బాగుంటుంది కానీ దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సి ఉంటుంది.

తెలుగులోనే కాకుండా దళపతి విజయ్ కుమార్( Thalapathy Vijay Kumar ) 69వ సినిమాకి కూడా అనేక మంది దర్శకులను అతడు పరిశీలనలో ఉంచాడట.ఆ లిస్ట్ లో త్రివిక్రమ్ చెప్పిన కథ కూడా ఉందని తెలుస్తోంది ఒకవేళ అన్ని లెక్కలు కుదిరితే తమిళంలో కూడా విజయ్తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో మాత్రమే సినిమా ఉంటుంది అనేది అఫీషియల్ సమాచారం.ఇవన్నీ కూడా రూమర్స్ గానే కొట్టి పారేయాల్సి ఉంటుంది.కొన్ని రోజులు ఆగితే గాని త్రివిక్రమ్ రూట్ క్లియర్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.