బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో అదిరేలా!

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క సినిమాతో మిగతా హీరోలను పక్కకు నెట్టి మరీ పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించు కున్నాడు.

పుష్ప సినిమాతో నార్త్ ప్రేక్షకులను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు రెండవ పార్ట్ తెరకెక్కుతుంది.పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా బన్నీ నెక్స్ట్ సినిమాను సందీప్ రెడ్డి వంగ( sandeepreddy vanga ) దర్శకత్వంలో అనౌన్స్ చేసాడు.

మరి ఈ సెన్సేషనల్ కాంబో ఇంకా సెట్స్ మీదకు వెళ్లనే లేదు.పుష్ప 2 తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తారు అని అంతా అనుకున్నారు కానీ బన్నీ ఈ లోపులోనే ఒక సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత సందీప్ తో స్టార్ట్ చేయబోతున్నాడు అని టాక్.

Advertisement
Trivikram To Make His First Pan-India Film With Allu Arjun, Trivikram Srinivas,

వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) తో నెక్స్ట్ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారని టాక్ వస్తుంది.

Trivikram To Make His First Pan-india Film With Allu Arjun, Trivikram Srinivas,

వీరి కాంబోలో నాలుగవ సినిమా తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా స్టార్ డమ్ పెంచుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత తాను చేసే సినిమాలన్నీ నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే మూడు వరుస విజయాలు అందుకున్న కలయిక కాబట్టి ఈ సినిమాపై ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Trivikram To Make His First Pan-india Film With Allu Arjun, Trivikram Srinivas,

ప్రజెంట్ త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి అయ్యేలోపు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 ( Pushpa 2 )పూర్తి చేయనున్నాడు.ఆ తర్వాత గ్యాప్ లేకుండా వీరి కాంబోలో సినిమా స్టార్ట్ అవుతుందట.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది..

Advertisement

పాన్ ఇండియా రేంజ్ లో ఈసారి అసరగొట్టేలా మూవీ ప్లాన్ చేసుకుంటున్నారట.మొత్తానికి ఈ సినిమా స్టార్ట్ కాకముందే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

తాజా వార్తలు