చివరకు త్రివిక్రమా?

ఏదో సినిమాలో డైలాగ్‌ ఉన్నట్లుగా పోలవరం ప్రాజెక్ట్‌ అయినట్లే అనిపిస్తుంది, కాని కాదు, అలాగే చిరంజీవి 150వ సినిమా వచ్చినట్లుగానే అనిపిస్తుంది, మరి కొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగానే అనిపిస్తుంది కాని కాదు.

గత మూడు సంవత్సరాలుగా చిరంజీవి 150వ సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటి వరకు చిరంజీవి తన 150వ సినిమా కోసం ఎన్నో వందల కథలు పదుల సంఖ్యలో దర్శకులను పరిశీలించాడు అంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.నిన్న మొన్నటి వరకు యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వినాయక్‌ దర్శకత్వంలో చిరు 150వ సినిమా ఉండే అవకాశాలున్నాయని అనుకున్నారు.

కాని తాజాగా చిరంజీవి తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయాలని కోరుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు ఎందరినో దర్శకులను ఈవార్తల్లో జొప్పించారు.

చివరకు త్రివిక్రమ్‌ను కూడా తీసుకు వచ్చారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా అనేది ఒట్టి పుకారు మాత్రమే అయ్యి ఉండవచ్చని మెగా అభిమానులు చెబుతున్నారు.

Advertisement

చిరంజీవి ప్రస్తుతం ఒక మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం ప్రయత్నాలు చేసున్నాడు.అలాంటి సమయంలో త్రివిక్రమ్‌ పేరును పరిశీలిస్తాడని తాము భావించడం లేదు అని కొందరు అభిమానులు అంటున్నారు.

కాని కొందరు అభిమానులు మాత్రం బాస్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే నటించడం కరెక్ట్‌ అని అంటున్నారు.మొత్తానికి మెగా 150వ సినిమా చర్చలోకి త్రివిక్రమ్‌ వచ్చి చేరాడు.

ఈయన ఎన్ని రోజులు చర్చలో ఉండి వెళ్తాడో చూడాలి.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు