టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయంలో ఫ్యాన్స్ కు ఒకింత కన్ఫ్యూజన్ నెలకొంది.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో పవన్ అభిమానులకు సైతం క్లారిటీ లేదు.ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా క్రిష్ లేదా ఏఎం రత్నం ఆ వార్తల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.
అయితే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే పవన్ కెరీర్ విషయంలో నష్టపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ల ఎంపికలో నటించే సినిమాల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది.
ఫలితంగా పవన్ నటించాల్సిన హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఆలస్యమవుతుంటే పవన్ రీమేక్ సినిమాలు మాత్రం మొదట షూటింగ్ జరుపుకుంటున్నాయి.

పవన్ తో సినిమాలను నిర్మిస్తున్న, తెరకెక్కిస్తున్న నిర్మాతలు, దర్శకులు ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారని అయితే ఈ విషయాలను వెల్లడించడానికి మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.రీఎంట్రీలో పవన్ ప్రాజెక్ట్ ల విషయంలో త్రివిక్రమ్ కీలకంగా మారారని సమాచారం.పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు కంటే వినోదాయ సిత్తం రీమేక్ మొదట రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మరోవైపు సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పెరుగుతోంది.వినోదాయ సిత్తం రీమేక్ కు రోజుకు 2.5 కోట్ల రూపాయల చొప్పున పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.పవన్ అడిగితే మరింత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ లకు ప్రకటించే అవకాశం దాదాపుగా లేదని తెలుస్తోంది.పవన్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.