Trivikram srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన ఐదు జీవిత సత్యాలు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram srinivas ) అతడు, అల వైకుంఠపురములో, జల్సా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఈ సినిమాలలో అతడు రాసిన డైలాగ్స్ అన్నీ కూడా చాలా ఆలోచింపజేసేలా ఉంటాయి.

అంత మంచి డైలాగ్స్ రాస్తాడే కాబట్టే అతనికి బెస్ట్ డైలాగ్ రైటర్‌గా 6 నంది అవార్డులు కూడా వచ్చాయి.ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాల్లోనే కాదు బయట సినిమా ఫంక్షన్లలో కూడా అద్భుతమైన డైలాగులు చెబుతుంటాడు.

ఆ డైలాగులు జీవిత సత్యాలుగా ఉంటాయి.అలా ఇప్పటికే ఎన్నో చెప్పాడు.వాటిలో కొన్ని మీకోసం అందజేస్తున్నాం.

1.తండ్రి విలు

వ: ఐదేళ్లప్పుడు కొడుకు తన తండ్రి హీరో అనుకుంటాడు.10 ఏళ్లకు వేరే పిల్లల తండ్రులను చూశాక తన నాన్న పెద్ద గొప్పోడేం కాదనుకుంటాడు.18 ఏళ్లు వచ్చాక సిగరెట్ తాగొద్దురా, ఇంటికి త్వరగా వచ్చేయ్ రా అని చెప్పినప్పుడు నాన్న పెద్ద నసగాడు అని అనుకుంటాడు. 25 ఏళ్లు వచ్చాక ఇంటి రెంటు, బిల్లులకే శాలరీ సరిపోక, మంత్ లాస్ట్‌లో అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు నాన్న అంత వేస్ట్ ఏమీ కాదనిపిస్తుంది.30 ఏళ్లు దాటాక పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నప్పుడు, వారికి జ్వరం వస్తే హాస్పిటల్ కి పరిగెడుతున్నప్పుడు నాన్న గుర్తుకు వచ్చి కన్నీళ్లు వస్తాయి.అది మనం చెబుదామనుకున్నా నాన్న ఉండడు, చనిపోతాడు.

2.ఆరోగ్యంపై నిర్లక్ష్యం:

మనం ప్రాపర్ గా గాలి పీల్చుకుంటే 99% వ్యాధులు రావు.గాలి కంప్లీట్‌గా ఫ్రీ.అయినా మనం గాలి పీల్చము.

Advertisement

దానికి బదులు సిగరెట్ కాల్చుతూ చనిపోవడానికి సిద్ధమవుతాం.చక్కగా మంచినీళ్లు తాగితే కూడా ఆరోగ్యంగా ఉంటాం.

మంచినీళ్లు కూడా పూర్తిగా ఉచితం.ఒకవేళ బయటికి వెళ్తే పది రూపాయలు పెడితే వాటర్ బాటిల్( Water bottle ) వస్తుంది.

అయినా దానిని కొనుక్కోము.బదులుగా బీరు కొని పాడైపోతాం.

3.గొప్ప ఆశయం కీలకం:

మనిషి ఆశయం గొప్పదైతే జీవితంలో ఎదుగుతాడు, చెడ్డదైతే పాతాళంలో పడిపోతాడు.

4.డబ్బు విలువ

జేబులో రూపాయి కూడా లేకపోతే అయిన వాళ్లు కూడా దూరం అవుతారు.

5.హాని లేని వినోదం

డబ్బులు పెట్టి సిగరెట్( Cigarett ) తాగితే ఆరోగ్యం నాశనం అవుతుంది.చెడు తిరుగుళ్ళు తిరిగితే జీవితమే నాశనం అవుతుంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

దానికి బదులు ఒక మూడు గంటల సినిమా చూడటం మంచిది.

Advertisement

తాజా వార్తలు