మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతేడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా, అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.
ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే అఫీషియల్‌గా ఈ సినిమాను ప్రారంభించినా, షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు.
అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందే త్రివిక్రమ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఈ క్రమంలో త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ హీరో రామ్ పోతినేనితో తెరకెక్కిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.కాగా ఈ సినిమాలో రామ్ కేవలం ఓ కేమియో తరహా పాత్రలో మాత్రమే నటిస్తాడని తెలుస్తోంది.
నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని, ఈ సినిమాను మల్టీస్టారర్ మూవీగా త్రివిక్రమ్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలోనే రామ్ పోతినేని కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.అటు రామ్ పాత్ర కూడా ఈ సినిమాలో వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ ఈ సినిమా స్క్రిప్టును విన్నాడని, అయితే ఈ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.మరి త్రివిక్రమ్ తెరకెక్కించబోయే ఈ మల్టీస్టారర్ మూవీలో పవన్ నటిస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా పవన్ ఇప్పటికే ‘అయ్యప్పనమ్ కొషియమ్’ చిత్ర రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే.