మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram ) శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం( Guntur Kaaram )సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతుంది.ముఖ్యంగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ అనేది బయటికి వస్తుంది.
ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తికాలేదు అనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 40 రోజులు మాత్రమే టైం ఉండటం తో ఎప్పుడు ఈ సినిమా పూర్తిగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది అలాగే ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే దానిమీద కూడా చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పటికే వాళ్ళు అనుకున్న టైమ్ కి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక దానికి తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ కూడా అభిమానులకి తెలియజేస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు( Maheshbabu ) అభిమానులకు ఈ సినిమా పట్ల చాలా అనుమానాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ తొందర తొందరగా షూట్ చేయాల్సి వస్తే ఈ సినిమా మొత్తాన్ని చుట్టేసినట్టుగా చేసేస్తున్నారా అనే డౌట్ లో కూడా మహేష్ బాబు అభిమానులు ఉన్నారు.ఇక దానివల్ల వాళ్లందరూ కూడా ఈ సినిమా పట్ల చాలా డౌట్ ఫుల్ గా ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయితే తప్ప మహేష్ బాబు ఫ్యాన్స్ కి త్రివిక్రమ్ మీద కోపం తగ్గదు…చూడాలి మరి ఈ సంక్రాంతి విన్నర్ గా మహేష్ బాబు నిలుస్తారా లేదా అనేది…
.