దిల్ రాజు నిర్మాణం లో త్రివిక్రమ్ భారీ చిత్రం

అటు ప్రేమ కథలు ఇష్ట పడే యువతను ఇటు కుటుంబ కథా చిత్రాలను ఇష్ట పడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధం గా కథలను రూపొందించుకుని , చక్కటి చిత్రాలను తీయటం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ది అందెవేసిన చేయి.

ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన అ.

ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.ఇదే విషయాన్నీ ప్రస్థావిస్తూ , ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు త్రివిక్రమ్ తో ఒక భారీ చిత్రాన్ని ప్రకటించారు.

ఒక పెద్ద స్టార్ హీరో తో ఈ చిత్రం ఉంటుంది అని , ఇతర వివరాలను తరువాత ప్రకటిస్తాం అని ఆయన తెలిపారు." త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నాకు నువ్వే కావాలి సినిమా రోజుల నుండి మంచి స్నేహం ఉంది.

సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం.ఇప్పుడు మా బ్యానర్ లో ఆయన తో ఒక భారీ సినిమా తేయబోతున్నాం " అని అన్నారు.

Advertisement

అ.ఆ చిత్రం విజయం గురించి మాట్లాడుతూ, "జూన్ లో పెద్ద సినిమా సక్సెస్ అయిన చరిత్ర లేదు.

అటువంటి ట్రెండ్ ని కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది.కేవలం ఒక వారం లో డిస్ట్రిబ్యూటర్ ల కు డబ్బులు తిరిగి రావటం అనేది ఈ మధ్య కాలం లో ఏ సినిమా కి జరగలేదు.

ఇంతటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ కి , మా ప్రొడ్యూసర్ చినబాబు గారికి నా అభినందనలు" అని అన్నారు.ఈ నూతన చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

ఉచిత గ్యాస్ సిలిండర్.. బీజేపీ సూపర్ ప్లాన్‌ వర్కౌట్ అయ్యేనా?
Advertisement

తాజా వార్తలు