స్టోరీ లీక్.. అలాంటి ఎలిమెంట్స్ తో బన్నీ కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Allu Arjun )కాంబో అంటే ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.ఎందుకంటే ఈ కాంబోలో ఇప్పటికే ముచ్చటగా మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

 Trivikram Allu Arjun Movie Latest Update, Trivikram Srinivas, Pushpa 2, Ala Vaik-TeluguStop.com

జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు మూడు కూడా మంచి హిట్ అయ్యాయి.ఇక హ్యాట్రిక్స్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న తర్వాత మరోసారి ఈ కాంబో కలిసి పని చేయబోతుంది.

ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అప్డేట్ వచ్చింది.తమ నాల్గవ సినిమాను అఫిషియల్ గా ప్రకటించగా ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ రోజే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా విషయంలో తాజాగా స్టోరీ గురించి ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.

లీక్ అయిన వార్తల ప్రకారం ఈ సినిమా కథ సోషియో ఫాంటసీ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ తో ఉండేలా త్రివిక్రమ్ కొత్తగా ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.అంతేకాదు త్రివిక్రమ్ బన్నీ రోల్ ను కూడా కొత్తగా వినూత్నంగా ప్లాన్ చేసాడని టాక్ వైరల్ అయ్యింది.మొత్తం మీద వీరి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా మరింత గ్రాండ్ గా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.

కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2( Pushpa 2 ) చేస్తున్నాడు.ఇది సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.అలాగే త్రివిక్రమ్( Trivikram Srinivas ) మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు.ఇలా ఈ ఇద్దరి ప్రాజెక్టులు పూర్తి అయితే కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube