తెలుగు ప్రేక్షకులకు చెన్నై బ్యూటీ త్రిష( Trisha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.త్రిష ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది త్రిష.ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
నాలుగు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.అయితే త్రిషకు ఇంకా పెళ్లి కాలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది.అంతా దర్శకుడు మణిరత్నం( Mani Ratnam ) పుణ్యమే అని చెప్పకతప్పదు.నటి త్రిష కెరీర్ పొన్నియిన్ సెల్వన్( Ponniyin Selvan ) చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి.ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది.
ఒక టైమ్‌లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి.అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది.
అందులో నటి ఐశ్వర్యరాయ్( Aishwarya Rai) కూడా నటించారు.నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు.
రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది.

ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది.అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్‌కు ఆ చిత్రంతోనే బీజం పడింది.ఆ తరువాత విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటించారు.
ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్, నివిన్‌బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు.అయితే లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు.దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్‌వన్ స్థానానికి వచ్చింది.