అప్పుడు కూతురులా ఉందన్నారు.. ఇప్పుడు జోడీ సూపర్ అంటున్నారు.. చిరు త్రిష జోడీపై రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.( Vishwambhara Movie ) ఈ సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 Trisha And Chiranjeevi Trolling Details, Trisha, Chiranjeevi, Trolling, Tollywoo-TeluguStop.com

దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ జంట మళ్ళీ కలిసి నటిస్తున్నారు.అయితే త్రిష చిరంజీవి కాంబోలో మూవీ అనగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

చిరుకి ప‌ర్పెక్ట్ జోడీ అంటూ ఓ రేంజ్ లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.పైగా త్రిష ఫాంలో ఉండ‌టంతో పాటు మునుప‌టి కంటే మ‌రింత అందంగానూ ఉండ‌టంతో సూప‌ర్ జోడీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

చిరుకి స‌రైన హీరోయిన్ త్రిష మాత్ర‌మేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.వ‌య‌సు వ్య‌త్యాసం కూడా బ్యాలెన్స్ అవుతుందంటూ పొగిడేస్తున్నారు.అయితే ఒక‌ప్పుడు ఇదే కాంబినేష‌న్ ని 18 ఏళ్ల క్రితం స్టాలిన్( Stalin Movie ) స‌మ‌యంలో ఎంత‌గా విమర్శించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో ఈ సోషల్ మీడియా లేదు.

కేవ‌లం టీవీ ఛానెళ్ల‌లో, వార్తా ప‌త్రిక‌ల్లో ఆ కాంబో సెట్ అవ్వ‌డంతో అప్ప‌టి యువ‌త చిరంజీవి కి త్రిష కూతురిలా ఉంది అంటూ దారుణంగా విమర్శించారు.ఆయ‌న స‌ర‌స‌న ఈవిడ హీరోయిన్ ఏంటి? అని విమ‌ర్శించారు.అయితే అప్పుడు చిరంజీవి వ‌య‌సు కూడా త‌క్కువే త్రిష వ‌య‌సు అంత‌క‌న్నా చిన్న‌ది.

అయితే అప్ప‌టికీ ఇప్ప‌టికీ త్రిష‌లో చాలా మార్పులొచ్చాయి.చిరు లో సైతం చాలా ఛేంజెస్ క‌నిపిస్తున్నాయి.వ‌య‌సు ముదురుతోన్న కొద్ది యంగ్ గా మారిపోతారు.

చిరు మునుప‌టి కంటే కూడా బాగా స్లిమ్ అయ్యారు.త్రిష మాత్రం కాస్త చ‌బ్బీ లుక్ లో ఉంది.

అలా మెయింటెన్ చేయ‌డం వ‌ల్లే ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావు ఇవ్వ‌లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube