కోవిడ్ సెంటర్ కు వెళ్లిన ఎమ్మెల్యే,క్వారంటైన్ వెళ్లాల్సిందే అన్న కోర్టు!

ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలనే అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

అయితే కొంతమంది ప్రజల బాధలు వినగానే స్పందిస్తారు,మరికొందరు ఎంతగా మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోరు.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడకి వెళ్ళాలి అన్నా ప్రజా ప్రతినిధులు జంకాల్సి వస్తుంది.అయితే త్రిపుర లో బీజేపీ ఎమ్మెల్యే,మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సుదీప్ రాయ్ ఒక రోగి యొక్క ఆర్తనాదాల కారణంగా అనధికారికంగా కోవిడ్ కేర్ సెంటర్ ను సందర్శించారు.

Case On Tripura BJP MLA After Visit The Covid Centre , Tripura BJP MLA, PPE Sui

దీనితో ఆయన కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తూ అనధికారికంగా కోవిడ్ కేర్ సెంటర్ ను సందర్శించారు అంటూ కోర్టు లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.సుదీప్ నియోజకవర్గం అయిన అగర్తల లో ఒక కరోనా రోగి తమ సెంటర్ లో పరిస్థితులు సరిగా లేవని,చాలా అధ్వానంగా ఉన్నాయి అంటూ ఇటీవల కొన్ని వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.

అయితే ఆ విషయం కాస్త ఎమ్మెల్యే సుదీప్ దృష్టికి రావడం తో అక్కడ పరిస్థితులు స్వయంగా చూసి తెలుసుకోవాలని ఆయన పీపీఈ కిట్ ను ధరించి ఆ కోవిడ్ సెంటర్ ను విజిట్ చేసి అక్కడ పరిస్థితుల గురించి అక్కడ ఉంటున్నవారిని అడిగి తెలుసుకున్నారు.అయితే అక్కడ ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టి ఆయన నిబంధనలు ఉల్లఘించి ఆ సెంటర్ కు వెళ్లారు అంటూ కోర్టు లో కేసు వేయడం తో అది కాస్త త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వెళ్లింది.

Advertisement

దీనితో సుమోటో గా కేసు ఫైల్ చేసిన మేజిస్ట్రేట్ వెంటనే సుదీప్ రాయ్ ని తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కు తరలించాలి అంటూ ఆదేశించారు.అయితే ఎమ్మెల్యే సుదీప్ మాత్రం క్వారంటైన్ కు వేళ్లను అంటూ కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదు.

ఇది దురుద్దేశంతో కూడిన ఉత్తర్వులని ఆరోపించారు.అసలు నాకు మేజిస్ట్రేట్ జారీ చేసిన మెమొరాండం అందక ముందే ఈ విషయం మీడియాకు,సోషల్ మీడియా కు ఎలా సమాచారం వెళ్ళింది అంటూ ఆయన ప్రశ్నించారు.

అయినా డాక్టర్ల సలహా, సూచనల మేరకు ఒళ్లంతా పీపీఈ కిట్ ధరించి ఆ సెంటర్ కు వెళ్లానని వారు అక్కడ ఎదుర్కొంటున్న బాధలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు