హర్యానాలోని భివానీ ( Bhiwani in Haryana )జిల్లాలో 12వ తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
విద్యార్థులు తమ సైన్స్ టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టారు.
బాణసంచాలను ఉపయోగించి బాంబును తయారు చేసి ఉంచారు.ఉపాధ్యాయుడు విద్యార్థులను మందలించడంతో విద్యార్థులు ఈ చర్యకు పాల్పడ్డారు.
కుర్చీ కింద బాంబు పెట్టగానే రిమోట్‌తో పేల్చేశారు విద్యార్థులు.ఈ పేలుడు కారణంగా కుర్చీకి పెద్ద రంధ్రం ఏర్పడింది.
అదృష్టవశాత్తూ ఉపాధ్యాయురాలికి ఎలాంటి గాయాలు కాలేదు.
12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి టీచర్ ( A student teacher )కుర్చీకింద బాణసంచా ఉపయోగించి బాంబును పెట్టారు.దీనిని యుట్యూబ్ లో చూసి తయారు చేసినట్లు సమాచారం.ఆ తరగతిలోని మరో విద్యార్థి ఆ బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేశాడు.
ఈ ఘటన అనంతరం విద్యాశాఖ అధికారులు( Education officials ) పాఠశాలకు చేరుకుని విచారణ జరిపి చర్యలు చేపట్టారు.యూట్యూబ్ ద్వారా పేలుడు పదార్థాలను తయారు చేయడం ఎలాగో విద్యార్థులు నేర్చుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పిల్లలను పాఠశాల నుంచి తొలగించే ఆలోచన ఉందని, అయితే ఈ విషయంపై తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పారని భవిష్యత్తులో విద్యార్థులు ఇలాంటివి చేయరని అధికారులకు హామీ ఇచ్చారు.
ఘటన అనంతరం విద్యార్థుల అకృత్యాలపై గ్రామంలో పంచాయతీ పెట్టారు.పంచాయితీ సందర్భంగా తరగతికి చెందిన 15 మంది విద్యార్థుల్లో 13 మంది ఈ ఘటనకు పాల్పడ్డారని, వారికి తెలిసిందని వెల్లడించారు.విద్యార్థులందరినీ వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నరేష్ మెహతా తెలిపారు.
ఏదేమైనా విద్యార్థులు చేసిన పనిని నెటిజన్లు పెద్దేత్తున్న మండిపడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy