సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో కూడా లవ్ ట్రాక్ లు అన్నది సహజం.ఇప్పటికే గత సీజన్ లు పలు జంటలు సెట్ అయిన విషయం తెలిసిందే.
గత సీజన్లో జోడి ల విషయానికి వస్తే రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, అఖిల్- మోనాల్ ఇలా పలు జంటలు బాగానే సెట్ అయ్యాయి.ఇక ఈ సీజన్లో కూడా రెండు లవ్ ట్రాక్ లు కనిపిస్తున్నాయి.
అందులో మొదటి జంట- ఆరోహి, ఇక రెండవ జంట అర్జున్-శ్రీ సత్య.కాకా హౌస్ లో ఉన్నది కేవలం రెండు జంటలే అయినా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కనిపిస్తోంది అని చెప్పవచ్చు.
శ్రీ సత్య అర్జున్ కి మధ్య ఏదో ఉంది అన్నది మాత్రం బాగా స్పష్టంగా అర్థం అవుతుంది.అలాగే హౌస్ లో మరొక కంటెస్టెంట్ వాసంతి విషయం పట్ల కూడా అదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా హౌస్ లో ఉన్న లవ్ ట్రాకుల గురించి నేహా అలాగే శ్రీహాన్ మాట్లాడుకున్నారు.శ్రీ హాన్, నేహాతో మాట్లాడుతూ అర్జున్‌కి శ్రీసత్య మీద ఏదో ఫీలింగ్ ఉంది,కానీ శ్రీసత్య, అర్జున్ ని పట్టించుకోవడం లేదని శ్రీ హాన్ అంటాడు.
మరి వాసంతి పట్ల కూడా అర్జున్ అలాగే బిహేవ్ చేస్తున్నాడని నేహా అంటోంది.

నాకు కూడా అలాగే అనిపిస్తోంది అని శ్రీహాన్ అంటాడు.ఏంటి ట్రైయాంగీల్ లవ్ స్టోరీ నడుస్తోందా అని నేహా కామెంట్ చేస్తుంది.కొన్ని కంట్రోల్ చేసుకోరా అని నేను ఎప్పుడు చెబుతుంటా కానీ అతను వినడు అని శ్రీహాన్ అంటాడు.
శ్రీ సత్య కావాలని అర్జున్‌ని హర్ట్ చేయడం కోసం అన్నయ్య అంటుంది అని అంటాడు శ్రీహాన్.అయితే నిజంగానే హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందా.
నిజంగానే ప్రేమ ఉందా లేదంటే కేవలం హౌస్ లో టాస్కుల విషయంలో ఆడటానికి అలా ఉంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది రెండు జంటలే అయినా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది అని చెప్పవచ్చు.







