తన గుండెను తానే చూసి మురిసిపోతున్న మహిళ.. కారణం ఇదే!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆర్గాన్స్ ఫెయిల్ కావడం వలన మరణిస్తున్నారు.ఆ సయమంలో అవయవాలు దొరికితే వారి జీవితం ఖచ్చితంగా నిలబడుతుంది.

 Transplant Patient Sees Own Heart Go On Display At Museum Details , Own Heart, S-TeluguStop.com

కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది.ఎందుకంటే అవసరమైన వెంటనే అవయవాలు దొరకవు.

అందుకే అవయవదానం( Organ Donation ) చేయడం అనేది అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనది అని అంటూ వుంటారు.ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో అవమవదానంపై ప్రజల్లో అవగాహన పెరిగింది.

వివరాల్లోకి వెళితే, ఓ మహిళకు 16ఏళ్ల క్రితం గుండె మార్పిడి శస్త్రచికిత్స( Heart Transplantation ) జరగగా ఆమె శరీరం నుంచి తీసిన అసలైన గుండెను ఒక మ్యూజియంలో పదిలపరిచారు.కట్ చేస్తే ఆమె 16సంవత్సరాల తర్వాత ఆమె అసలు గుండెని చూసుకుంది.హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌కు చెందిన జెన్నిఫర్ సుట్టన్,( Jennifer Sutton ) లండన్‌లోని హంటేరియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన తన స్వంత అవయవాన్ని చూసి అవాక్కయింది.ఈ క్రమంలోనే తన అనుభూతిని జనాలతో సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ క్రమంలో ఆమె తన గతం గురించి చెప్పుకొచ్చింది.అపుడు ఆమె 22 ఏళ్ల విద్యార్థిని.ఒక సమస్య రాగా డాక్టర్లను కలిస్తే, ఆమెకు రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి ఉన్నట్లు నిర్ధారణ చేసారు.గుండె మార్పిడి చేయించుకోకపోతే చనిపోతుందని వైద్యులు చెప్పడంతో జూన్ 2007లో, ఆమెకు సరిపోయే గుండె దొరకడంతో ఆమె గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసుకుంది.

తరువాత ఆమె కోలుకుంది.ఈ క్రమంలో ఆమె తన అసలు గుండె గురించి ఏ రోజూ ఆలోచించలేదట.అనూహ్యంగా ఆమె తాజాగా ఆమె అసలు గుండెని చూసి చాలా తన్మయత్వానికి గురైందని చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube