జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది.కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
మానవపాడు మండలం గార్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది.మంగంపేట శివారులోని కృష్ణానదిలో నలుగురు చిన్నారులు సరదాగా ఈతకు వెళ్లారు.
నదిలో లోతైన గుంతలో జారి బయటకు రాలేక చనిపోయారని తెలుస్తోంది.మృతులు ఇటిక్యాల మండలం వల్లూరు వాసులుగా గుర్తించారు.







