ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం( Vishakapatnam ) మరి అంతర్జాతీయ సదస్సుకు వేదికయింది.ఈనెల మూడవ తారీఖు నాడు ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో జరగటం తెలిసిందే.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.కాగా ఇప్పుడు జీ20 ( G20 ) అనే మరో అంతర్జాతీయ సదస్సుకీ విశాఖ వేదిక అయింది.
రేపటినుండి రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ థీమ్ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సులో పాల్గొనటానికి దాదాపు 69 మంది విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు.మొత్తం ఏడు సెషన్స్, ఒక వర్క్ షాప్ జరుగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రేపు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ ( CM Jagan ) సదస్సులో పాల్గొనబోతున్నారట.జీ20 సదస్సు నేపథ్యంలో విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.ఈనెల 28, 29, 30 తేదీలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలియజేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకోవడం జరిగింది.
ఈ సదస్సులో చివరి రోజు.దేశవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ లు విద్యార్థులు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు.
విద్యార్థులతో సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల ప్రతినిధుల నాలేడ్జ్ ఎక్స్చేంజ్ ఉంటుందని స్పష్టం చేశారు.