ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణను ఆక్రమించడానికి మోదీ, దేశాన్ని ఆక్రమించడానికి కేసీఆర్ బయల్దేరారని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఫిరాయింపుల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయని మండిపడ్డారు.
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.అనంతరం మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రతి గ్రామంలో ఇంఛార్జీలను నియమిస్తామని తెలిపారు.







