తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( TPCC Chief Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై( BRS Government ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వరి వేస్తే ఉరన్నారన్న ఆయన సీఎం కేసీఆరే( CM KCR ) 150 ఎకరాల్లో వేశారని తెలిపారు.రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు కానీ కనీసం పది గంటలు కూడా రావడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అంతేకాకుండా రైతులకు ఎరువులు ఉచితం అని గంటల తరబడి క్యూలో నిలబెట్టారని విమర్శించారు.కథల కంచికి.కేసీఆర్ ఫామ్ హౌస్ కి అంటూ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగెత్తి పోయారన్న ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.