హైదరాబాద్ లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఇందిరాపార్క్ కు బయలు దేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం కొనసాగింది.అనంతరం రేవంత్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో రేవంత్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.







