కామారెడ్డి జిల్లాలో టీపీసీసీ చీఫ్ నిరుద్యోగ నిరాహార దీక్ష

TPCC Chief On Hunger Strike In Kamareddy District

కామారెడ్డి జిల్లా గాంధారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.

 Tpcc Chief On Hunger Strike In Kamareddy District-TeluguStop.com

పేపర్ లీక్ వ్యవహారంలో కేవలం ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉందని ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.మంత్రి కేటీఆర్ ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా అని నిలదీశారు.

పెద్దల పేర్లు చెబితే నిందితులను ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆరోపించారు.చంచల్ గూడ జైలులో నిందితులను కలిసిన వారి లిస్ట్ బయటపెట్టాలని కోరారు.

అదేవిధంగా చంచల్ గూడ జైలు సీసీ ఫుటేజీని బహిరంగ పరచాలన్నారు.టీఎస్పీఎస్సీలో పని చేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే సుమారు 20 మంది అక్రమంగా పరీక్ష రాశారని విమర్శించారు.కేటీఆర్ కార్యాలయం నుంచే ఇదంతా జరిగిందన్న రేవంత్ రెడ్డి గ్రూప్ -1లో వంద మార్కులు దాటిన వారి జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

Video : TPCC Chief On Hunger Strike In Kamareddy District #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube