తెలుగు లో రోజురోజుకి పెరుగుతున్న '2018' వసూళ్లు..మరో 'కాంతారా' కానుందా?

కేరళ( Kerala )లో 2018 వ సంవత్సరం లో సంభవించిన వరదలు, అక్కడి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.అప్పటి వరదల వల్ల వచ్చిన నష్టం నుండి ఇప్పటికీ పూర్తిగా తేరుకోలేదు ఆ రాష్ట్రం.

 Tovin Thomas 2018 Movie Highest Grossing Film Kerala,2018 Movie,tovin Thomas,ker-TeluguStop.com

ఎంతో మంది ప్రాణాలను, వేల కోట్ల నష్టాలను తెచ్చిపెట్టిన ఆ వరదలు తల్చుకున్నప్పుడల్లా కేరళ ప్రజలు వణికిపోతారు.అలాంటి సంఘటనని ఆధారంగా తీసుకొని, వరదల్లో చిక్కుకున్న లక్షలాది మంది లో ఒక నలుగురి కథలను తీసుకొని డైరెక్టర్ జూడ్ ఆంటోనీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ ‘2018 ‘ అనే చిత్రం కేరళ బాక్స్ ఆఫీస్ ని శాసిస్తుంది.

ఇండియా లో అతి చిన్న సినిమా ఇండస్ట్రీ గా పేరు తెచ్చుకున్న మలయాళం సినిమా ఇండస్ట్రీ , ఈ చిత్రం తో టాలీవుడ్ మరియు కోలీవుడ్ మర్కెట్స్ తో సరిసమానంగా నిల్చింది.ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం మలయాళం బాషలోనే 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించిందట.

Telugu Kantara, Kerala, Tollywood, Tovin Thomas-Movie

అలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తెలుగు లో గీత ఆర్ట్స్ సంస్థ డబ్బింగ్ చేసి రీసెంట్ గానే విడుదల చేసింది.ఇక్కడ కూడా మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమాకి మొదటి రోజు సుమారుగా కోటి పది లక్షల రూపాయిల గ్రాస్ మరియు 50 లక్షల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది.పైగా ఇప్పుడు టాలీవుడ్ లో గొప్ప సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడడం లేదు కాబట్టి, ఆడియన్స్ కి ఇప్పుడు మొదటి ఛాయస్ గా 2018 చిత్రం నిల్చింది.టాక్ కూడా చాపకింద నీరు లాగ పాకిపోతుండడం తో ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు.

మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు ఈ చిత్రానికి తెలుగు లో వసూళ్లు అమాంతం పెరిగిపోయింది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండవ రోజు కోటి 78 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

Telugu Kantara, Kerala, Tollywood, Tovin Thomas-Movie

రెండవ రోజు షేర్ 65 లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది, ఇక మూడవ రోజు ఆదివారం కావడం తో, కోటి రూపాయిల షేర్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇలా రోజు రోజుకి పెరుగుతూ పోతున్న వసూళ్లను చూస్తుంటే ‘కాంతారా'( Kantara ) చిత్రం గుర్తుకు వస్తుంది.ఈ సినిమా కూడా ఇలాగే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ తో ప్రారంభం అయ్యి, 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.మొన్న శుక్రవారం వరకు 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగు కలెక్షన్స్ కూడా జతకవడం చేత 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

తెలుగు లో ఈ చిత్రాన్ని కేవలం రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.ఇప్పటి వరకు కోటి 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటి, లాభాల్లోకి అడుగుపెట్టబోతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube