ఒకే ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదితే, ఆ క్రికెటర్ స్టార్ బ్యాట్స్ మెన్ అయినట్టే.తాజాగా ఫిబ్రవరి 21న రైల్వేస్ తో జరిగిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యంగ్ క్రికెటర్ వంశీకృష్ణ( Vamsi Krishna ) ఒకే ఓవర్లో ఏకంగా 6 సిక్సర్లు బాదాడు.
దీంతో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు బాదిన నాలుగవ భారత బ్యాటర్ గా నిలిచాడు.అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారో చూద్దాం.
గ్యారీ సోబర్స్:
వెస్టిండీస్ మాజీ దిగ్గజం ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.1968 ఆగస్టు 31వ తేదీ నాటింగ్ హమ్ షైర్ తరుపున ఆడుతూ.గ్లామోర్గాన్ బౌలర్ మాల్కమ్ నాష్ వేసిన ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.
రవిశాస్త్రి:
భారత జట్టు మాజీ దిగ్గజం రవిశాస్త్రి( Ravi Shastri ) 1985 జనవరి 19న బాంబే వర్సెస్ బరోడా మధ్య జరిగిన రంజీ ట్రోఫీలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.
హెర్షెల్ గిబ్స్:
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ గా వన్డే క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు.2007లో వన్డే ప్రపంచ కప్ లో సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 6 సిక్సర్లు బాదాడు.
యువరాజ్ సింగ్:
భారత జట్టు మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్( Yuvraj Singh ) 2007 టీ20 ప్రపంచ కప్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
రాస్ వైట్లీ:
ఇంగ్లాండ్ ప్లేయర్ రాస్ వైట్లీ( Ross Whiteley ) 2017 జూలై 23న బ్లాస్ట్ లో యార్క్ షైర్ తో జరిగిన వోర్సెస్టర్ షైర్ మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.
హాజ్రతుల్లా జజాయ్:
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ హాజ్రతుల్లా జజాయ్( Hazratullah Zazai ) 2018 అక్టోబర్ 14న ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
కీరన్ పోలార్డ్:
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్( Kieron Pollard ) 2021 మార్చి 3న జరిగిన టీ20 సిరీస్ లో వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
జస్కరన్ మల్హోత్రా:
యునైటెడ్ స్టేట్స్ బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా( Jaskaran Malhotra ) 2021 సెప్టెంబర్ 9న జరిగిన యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ న్యూగినియా మ్యాచ్లో ఓకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
రుతురాజ్ గైక్వాడ్:
భారత జట్టు బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్ర విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.