Six Sixes In An Over : ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు బాదిన టాప్-10 క్రికెటర్లలో నలుగురు భారతీయులే..!
TeluguStop.com
ఒకే ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదితే, ఆ క్రికెటర్ స్టార్ బ్యాట్స్ మెన్ అయినట్టే.
తాజాగా ఫిబ్రవరి 21న రైల్వేస్ తో జరిగిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యంగ్ క్రికెటర్ వంశీకృష్ణ( Vamsi Krishna ) ఒకే ఓవర్లో ఏకంగా 6 సిక్సర్లు బాదాడు.
దీంతో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు బాదిన నాలుగవ భారత బ్యాటర్ గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారో చూద్దాం.
H3 Class=subheader-styleగ్యారీ సోబర్స్:/h3p """/" /వెస్టిండీస్ మాజీ దిగ్గజం ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.
1968 ఆగస్టు 31వ తేదీ నాటింగ్ హమ్ షైర్ తరుపున ఆడుతూ.గ్లామోర్గాన్ బౌలర్ మాల్కమ్ నాష్ వేసిన ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.
H3 Class=subheader-styleరవిశాస్త్రి:/h3p """/" / భారత జట్టు మాజీ దిగ్గజం రవిశాస్త్రి( Ravi Shastri ) 1985 జనవరి 19న బాంబే వర్సెస్ బరోడా మధ్య జరిగిన రంజీ ట్రోఫీలో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.
H3 Class=subheader-styleహెర్షెల్ గిబ్స్:/h3p """/" / సౌత్ ఆఫ్రికా బ్యాటర్ గా వన్డే క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు.
2007లో వన్డే ప్రపంచ కప్ లో సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 6 సిక్సర్లు బాదాడు.
H3 Class=subheader-styleయువరాజ్ సింగ్:/h3p """/" / భారత జట్టు మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్( Yuvraj Singh ) 2007 టీ20 ప్రపంచ కప్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
H3 Class=subheader-styleరాస్ వైట్లీ:/h3p """/" / ఇంగ్లాండ్ ప్లేయర్ రాస్ వైట్లీ( Ross Whiteley ) 2017 జూలై 23న బ్లాస్ట్ లో యార్క్ షైర్ తో జరిగిన వోర్సెస్టర్ షైర్ మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.
H3 Class=subheader-styleహాజ్రతుల్లా జజాయ్:/h3p """/" / ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ హాజ్రతుల్లా జజాయ్( Hazratullah Zazai ) 2018 అక్టోబర్ 14న ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
H3 Class=subheader-styleకీరన్ పోలార్డ్:/h3p """/" / వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్( Kieron Pollard ) 2021 మార్చి 3న జరిగిన టీ20 సిరీస్ లో వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
H3 Class=subheader-styleజస్కరన్ మల్హోత్రా:/h3p """/" / యునైటెడ్ స్టేట్స్ బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా( Jaskaran Malhotra ) 2021 సెప్టెంబర్ 9న జరిగిన యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ న్యూగినియా మ్యాచ్లో ఓకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు.
H3 Class=subheader-styleరుతురాజ్ గైక్వాడ్:/h3p """/" / భారత జట్టు బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్ర విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.
ఎండ వల్ల నల్లగా మారిన చేతులు, పాదాలను ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!