తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి సమయంలోనే చాలా మంది నటులు సినిమాల్లో రాణించడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.
ఇలాంటి వాళ్లలో ప్రభాస్( Prabhas ) ఒకరు.ఈయన ప్రస్తుతం సలార్ సినిమాతో మంచి హిట్ అందుకొని తనకి ఒక ప్రత్యేక మైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

అందులో భాగంగానే ఇంతకు ముందు కూడా ఆయన నటించిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.అలానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించి పెట్టాయి.అయితే ఇప్పుడు సలార్ ( Salar )సినిమాతో పాన్ ఇండియా లోనే నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పుడు ప్రభాస్ తో తమిళ్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj ) సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ ప్రభాస్ కి కథ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఆ స్టోరీ కూడా ప్రభాస్ కి నచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజు డబుల్ ఎక్స్ అనే సినిమా( Double X ) చేస్తాడు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోనప్పటికీ విమర్శకుల ప్రశంసలు అయితే పొందింది.

దాంతోనే ఇప్పుడు ఒక మంచి మాస్ ఫిలిం చేయాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ కి ఆయన ఫ్రీ అవ్వడానికి రెండు సంవత్సరాల టైం పడుతుంది.ఇక ఇదే క్రమంలో కార్తీక్ సుబ్బరాజు కి ఉన్న కమిట్మెంట్స్ కూడా పూర్తవుతాయి.
అవన్నీ పూర్తి అయిన తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని కార్తీక్ సుబ్బరాజు అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో…









