ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు.
ఈక్రమంలోనే వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని రుద్రరాజు తెలిపారు.2024 ఎన్నికలకు అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నామని వెల్లడించారు.ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఈ మేరకు త్వరలో కాంగ్రెస్ అగ్ర నాయకులు ఏపీలో పర్యటిస్తారని స్పష్టం చేశారు.







