2023, ఆగస్టు నెలలో చాలా కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయనున్నాయి.ఈ నెలలో వన్‌ప్లస్ నుంచి శామ్‌సంగ్ వరకు చాలానే ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి.ఈ అన్ని ఫోన్లలో టాప్ 7 స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్స్, ధరలపై ఓ లుక్కేద్దాం.
• వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open):

వన్‌ప్లస్ ఓపెన్( OnePlus Open ) అనేది ఒక ఫోల్డింగ్ ఫోన్.ఇది 7.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.దీని ధర సుమారు రూ.లక్ష ఉంటుందని అంచనా.ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్ రిలీజ్ డేట్ ఆగస్టు 29.
• రియల్‌మీ జీటీ నియో 6 (Realme GT Neo 6):

రియల్‌మీ జీటీ నియో 6( Realme GT Neo 6 ) మొబైల్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో రానుంది.దీని ధర దాదాపు రూ.45,000 ఉంటుందని టాక్.
* టెక్నో పోవా 5 సిరీస్ (Tecno Pova 5 Series):

టెక్నో పోవా 5 సిరీస్ ఫోన్లు 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి స్పెషఫికేషన్స్ తో లాంచ్ కానున్నాయి.వీటి ప్రారంభ ధర రూ.15,000 కాగా ఇది ఆగస్టు 21లోగా లాంచ్ అయ్యే అవకాశముంది.
• ఇన్ఫీనిక్స్ జీటీ 10 సిరీస్ (Infinix GT 10 Series):

ఇన్ఫీనిక్స్ జీటీ 10 సిరీస్ ఫోన్లు రెండు వేరియంట్లలో ఆగస్టు 3న రిలీజ్ కానున్నాయి.ఇవి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఆఫర్ చేస్తాయి.వీటి స్టార్టింగ్ ధర రూ.20,000 ఉండొచ్చు.
• రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G):

ఇండియన్ మొబైల్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెడ్‌మీ 12 5జీ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఇది అందుబాటులోకి రానుంది.ఇందులో ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.దీని ధర రూ.15,000.
• మోటోరోలా జీ14 (Motorola G14):

మోటోరోలా జీ14లో 6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.ఈ నెలలోనే రిలీజ్ కానున్న దీని అంచనా ధర రూ.12,000.
• శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G):

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్34 అనేది ఒక మిడ్-రేంజ్ 5జీ ఫోన్.ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉంటాయి.దీని అంచనా ధర రూ.17,000-రూ.20,000.
.