కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్( Piyush Goyal ) భారతీయ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.పాదాలకు సరిగ్గా సరిపోయే పాదరక్షలను( Footwear ) భారతీయ ప్రజలు సులభంగా ఎంపిక చేసుకునేలా ఫుట్‌వేర్ కోసం ఇండియన్ సైజింగ్ చార్ట్ సిస్టమ్ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు.
ఇండియన్ ఇంటర్నేషనల్ ఫుట్‌వేర్ ఫెయిర్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి పీయూష్ ఫుట్‌వేర్‌ను ఇండియన్ సైజుల్లో తీసుకురావడం చాలా మందికి ప్రయోజకరంగా ఉంటుందని వెల్లడించారు.ఆయన ఇంకా మాట్లాడుతూ భారతీయులకు సరిపోయే దేశీయ సైజును కనుగొన్నామని చెప్పారు.
దాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తామని అన్నారు.
ఇప్పటివరకు షూస్, చెప్పుల కొలతలు అమెరికా, బ్రిటన్‌లలో ఉపయోగించే సైజుల్లో సేల్ అవుతున్నాయి.
యూకే, యూఎస్ అని ఉండే ఈ మెజర్‌మెంట్స్ భారతీయులలో గందరగోళం సృష్టిస్తుంటాయి.ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సైట్స్‌లో కొనుక్కునేవారికి ఈ కొలతలు అర్థం కాక వేటిని ఆర్డర్ చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు.

అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఇండియా( India ) తనకంటూ స్పెషల్ మెజర్‌మెంట్ రెడీ చేసుకుంటోందన్న మంత్రి, తద్వారా భారతీయులు తమకు కావాల్సిన పాదరక్షలను కచ్చితమైన కొలతలతో పొందడానికి వీలవుతుందని అన్నారు.ఈ కొత్త కొలత ఏమిటో, అది ఎలా పని చేస్తుందో మంత్రి ఇంకా వెల్లడించలేదు.అయితే, ఇది భారతీయులకు పాదరక్షలను కొనడం సులభతరం చేస్తుందని, ఈ పరిశ్రమకు మరింత ప్రజాదరణ పొందుతుందని అతను అన్నారు.

భారతదేశ పాదరక్షల పరిశ్రమ( Footwear Industry ) వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు.ఈ పరిశ్రమ ప్రస్తుతం 45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.ఇది ప్రతి సంవత్సరం 10% వేగంతో పెరుగుతోంది.
భారతీయ సైజు పాదరక్షలు అమల్లోకి వస్తే, ఇది ఈ పరిశ్రమకు మరింత ప్రజాదరణ పొందడంలో సహాయపడుతుందని మంత్రి అన్నారు.ఇది భారతీయులకు పాదరక్షలను కొనడం సులభతరం చేస్తుందని, ఈ పరిశ్రమకు మరింత ఉద్యోగాలు కల్పిస్తుందని అతను అన్నారు.







