ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్లు వీరే..!

Top 5 Wicket Taking Bowlers In Ipl History Details, Top 5 Bowlers, Top Wicket Taking Bowlers ,ipl , Ipl Top Bowlers, Amith Mishra, Yuzvendra Chahal, Piyush Chawla, Dwayne Bravo, Lasith Malinga, Ipl 2023, Ipl 16

క్రికెట్ మ్యాచ్ గెలవడం వెనక బ్యాటర్లే కాదు బౌలర్లు ( Bowlers ) కూడా కీలకపాత్ర పోషిస్తారు.కేవలం బౌలర్ వేసే ఒక బంతితో మ్యాచ్ మలుపు తిరుగుతుంది.

 Top 5 Wicket Taking Bowlers In Ipl History Details, Top 5 Bowlers, Top Wicket Ta-TeluguStop.com

క్రికెట్ టీంలో బ్యాటర్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.బౌలర్లకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది.

బౌలర్లు బంతితో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి కట్టడి చేస్తారు.కొందరు బౌలర్లు వేసే బంతిని కొట్టడానికే బ్యాటర్లు భయపడుతుంటారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు ఎవరో చూద్దాం.

Telugu Amith Mishra, Dwayne Bravo, Ipl, Ipl Top Bowlers, Lasith Malinga, Piyush

1.డ్వేన్ బ్రావో( Dwayne Bravo ) ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు.కరేబియన్ కి చెందిన ఈ బౌలర్ 2008 నుండి 2022 వరకు ఆడాడు.మొత్తం 161 మ్యాచ్లలో.158 ఇన్నింగ్స్ లలో 183 వికెట్లు తీసి జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

Telugu Amith Mishra, Dwayne Bravo, Ipl, Ipl Top Bowlers, Lasith Malinga, Piyush

2.లసిత్ మలింగ కు ( Lasith Malinga ) ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఉండేది.అయితే బ్రావో ముందుకు దూసుకుపోవడంతో మలింగ రెండవ స్థానంలో ఉన్నాడు.2009 నుండి 2019 వరకు 122 మ్యాచ్లలో 170 వికెట్లు తీశాడు.అంతేకాకుండా ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన ఘనత, ఆరుసార్లు నాలుగు వికెట్లు తీసిన ఘనత మలింగ పేరుపై ఉంది.

Telugu Amith Mishra, Dwayne Bravo, Ipl, Ipl Top Bowlers, Lasith Malinga, Piyush

3.యుజ్వేంద్ర చహల్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.2013లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి 131 మ్యాచ్లలో 166 వికెట్లు తీశాడు.మలింగ రికార్డును బ్రేక్ చేయాలంటే ఇంకో నాలుగు వికెట్లు తీస్తే సరిపోతుంది.ఇక మొదటి స్థానానికి వెళ్లాలంటే ఈ సీజన్లో 18 వికెట్లు తీస్తే ఓ అరుదైన రికార్డు ఖాతాలో పడుతుంది.

Telugu Amith Mishra, Dwayne Bravo, Ipl, Ipl Top Bowlers, Lasith Malinga, Piyush

4.అమిత్ మిశ్రా ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నాడు.154 మ్యాచులలో 166 వికెట్లు తీశాడు.ప్రస్తుతం మిశ్రా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆడుతున్నాడు.

Telugu Amith Mishra, Dwayne Bravo, Ipl, Ipl Top Bowlers, Lasith Malinga, Piyush

5.పీయూష్ చావ్లా ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.2008 నుంచి ఐపీఎల్ లో 165 మ్యాచ్లలో 157 వికెట్లు తీశాడు.

తరువాత రవిచంద్రన్ అశ్విన్ 184 మ్యాచులలో 157 వికెట్లు తీసి ఆరవ స్థానంలో, భువనేశ్వర్ కుమార్ 154 వికెట్లు తీసి ఏడవ స్థానంలో, సునీల్ నరైన్ 152 వికెట్లులుతీసి ఎనిమిదవ స్థానంలో, హర్భజన్ సింగ్ 150 వికెట్లులుతీసి 9వ స్థానంలో, బుమ్రా 145 వికెట్లతో పదవ స్థానంలో ఉన్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube