ఆదిపురుష్ పండగ పోస్టర్ లో ఇన్ని తప్పులా.. ప్రభాస్ పరువు మళ్లీ తీశారంటూ?

ప్రభాస్( Prabhas ) రీల్ లైఫ్ లో అయినా రియల్ లైఫ్ లో అయినా వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.అయితే ఆదిపురుష్( Adipurush ) సినిమా మాత్రం ప్రభాస్ ను వివాదాలకు అంతకంతకూ దగ్గర చేస్తోంది.

 Prabhas Adipurush Poster Mistakes Details Here Goes Viral  In Social Media ,  Bo-TeluguStop.com

అయితే ఆదిపురుష్ పండగ పోస్టర్ తాజాగా విడుదలైంది.అయితే ఈ పోస్టర్ విడుదలైందనే ఆనందం ఫ్యాన్స్ కు ఎంతో సమయం నిలవలేదు.

ఈ పోస్టర్ విషయంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమైందనే సంగతి తెలిసిందే.

సాధారణంగా రాముడి పాత్రను ఎవరైనా సాత్వికంగా చూపిస్తారని ఓం రౌత్( Om Raut ) మాత్రం వీరుడిలా చూపించేలా ప్రయత్నించారని పోస్టర్ విషయంలో కామెంట్లు వినిపిస్తున్నాయి.లక్ష్మణునికి గడ్డం ఏంటని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సీత మెడలో తాళి లేదని సీతకు మెట్టెలు లేవని కొంతమంది చెబుతున్నారు.

లక్ష్మణుని పాత్ర ధరించిన దుస్తుల విషయంలో సైతం విమర్శలు వినిపిస్తున్నాయి.సీరియళ్ల స్థాయిలో కూడా ఆదిపురుష్ ప్రమోషనల్ మెటీరియల్ లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఆదిపురుష్ విడుదలైన తర్వాత కూడా వివాదాల్లో చిక్కుకోనుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఆదిపురుష్ మూవీని రిలీజ్ చేయవద్దని రిలీజ్ చేస్తే ప్రభాస్ ఇమేజ్ పై నెగిటివ్ ఒపీనియన్ కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలీవుడ్ డైరెక్టర్లకు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వవద్దని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ స్థాయిలో విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పోస్టర్ చూస్తుంటే ముఖాలను మార్ఫ్ చేశారని అనిపిస్తోందని పోస్టర్ డిజైన్ కూడా రాని వాళ్లు పెద్ద సినిమా తీయడం ఎందుకని కామెంట్ చేస్తున్నారు.

ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube