ఢిల్లీలో రేపు జరగాల్సి ఉన్న ఇండియా కూటమి భేటీ వాయిదా పడింది.ఈ మేరకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి సతీష్ కుమార్ తో పాటు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతలు హాజరు కాలేమని చెప్పారు.
తమ బదులుగా వేరే సభ్యులను భేటీకి పంపిస్తామని తెలిపారు.ఈ క్రమంలోనే ఇండియా కూటమి సమావేశం వాయిదా వేసినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న కూటమి రేపు ఢిల్లీలో సమావేశం కావాలంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.