సందీప్ కిషన్ కెరియర్ ఏంటి ఇలా తయారైంది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో అయిన సందీప్ కిషన్( Sundeep Kishan ) ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన తన కెరీర్లో ముందుకు వెళ్తాడు.లేదంటే మళ్ళీ ప్లాపుల్లో మిగిలిపోతాడు.

ఇక ఇదే క్రమంలో ఈయనకి ఇప్పటికే వరుసగా చాలా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఇప్పటికే ఆయన మార్కెట్ చాలా డౌన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే తప్ప సందీప్ కిషన్ మార్కెట్ తిరిగి రాదు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అందుకోవడం సందీప్ కిషన్ కెరీర్ కి( Sundeep Kishan Career ) చాలా ముఖ్యం.ఇప్పటికే ఈయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 15 సంవత్సరాల పైన అవుతున్న కూడా ఈయనకి సరైన సక్సెస్ అయితే ఏది పడడం లేదు.అందుకోసమే ఇప్పుడు ఈయన కెరీయర్ ని చాలా కేర్ ఫుల్ గా డిజైన్ చేసుకుంటే తప్ప ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేడు.

Advertisement

ఇక ఇప్పటికే ఈయనతో పాటు సినిమాలు చేస్తున్న హీరోలందరూ కూడా ఈయన ని దాటేసి ముందుకు వెళ్తుంటే ఈయన మాత్రం ఇక్కడ ఇలాగే ఉండిపోతున్నాడు.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా( Venkatadri Express ) ఈయనకి చివరి సక్సెస్ అనే చెప్పాలి.ఇక ఈయనకి హిట్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతుంది.

అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక హిట్ అయితే పడలేదు.ఇదే తరహాలో ఈయన ఫ్యూచర్ లో కూడా ఇలాగే ప్లాప్ లు కొనసాగిస్తే మాత్రం ఈయన ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అవ్వడం పక్క అని ట్రేడ్ పండితులు తెలియ జేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు