70 ఏళ్ళు పైబడిన ఈ టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు ఎలా ఉన్నారో .?

అలనాటి సీనియర్ కథానాయకులలో సీనియర్ ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వర్ రావు కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ ని ఏలారు.

ఆ తర్వాత కృష్ణ, కృష్ణం రాజు,శోభన్ బాబు వంటి హీరోలు వచ్చారు.

ఇందులో కొంతమంది మరణించారు.మరికొంతమంది ఇప్పటికి జీవించి ఉన్నారు.

మరి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం.అలనాటి నటుల్లో ఒకరు, సీనియర్ ఎన్టీఆర్ కి జోడిగా విలన్ పాత్రలు చేసిన నటుడు కైకాల సత్యనారాయణ ఇతని వయసు చూస్తే ఎనభైఐదు సంవత్సరాలు.

అలాగే అలనాటి హీరోయిన్స్ లో ఒకరైన జమున వయసు కూడా ఇంచుమించు ఎనభై సంవత్సరాలకి పైనే ఉంటాయి.ఇంకా కృష్ణకుమారి సోదరి అయినా షావుకారు జానకి వయసు కూడా తొంబై సంవత్సరాలకి చేరువలో ఉంది.

Advertisement

అలాగే డెబ్భై సంవత్సరాల వయసు గల నటీనటుల సంగతి చూస్తే, ముందు వరుసలో ఉండేది సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత కృష్ణం రాజు ఉంటారు.వీళ్లు ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నారు.

అలాగే సీనియర్ నటుడు చలపతి రావు ఇప్పటికి సినిమాల్లో నటిస్తున్నారు.అయన వయసు డెబ్బైఐదుకు ఎక్కువే ఉంటుంది.

అలాగే మరో ప్రముఖ నటి శారద వయసు కూడా డెబ్భైకి పైనే ఉంటుంది.శారద సినిమాకి దూరం అయి చాలా సంవత్సరాలు అవుతుంది.

ఒకవేళ తగిన పాత్ర లభిస్తే శారద మళ్ళీ తెర పై నటించేందుకు రెడీగా ఉన్నారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

అలాగే ఒకప్పుడు హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చంద్ర మోహన్ వయసు కూడా డెబ్బైఐదు సంవత్సరాలు.ఇప్పటికి హీరోకి తండ్రి పాత్రలో చంద్రమోహన్ నటిస్తున్నారు.మరియు ప్రముఖ హాస్యనటుడు రాజబాబు సరసన నటించిన రమాప్రభ వయసు కూడా డెబ్భై సంవత్సరాలకి పైనే ఉంటుంది.

Advertisement

రమాప్రభ ఇప్పటికి ఆర్గ్యంతో ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారు.అలాగే అలనాటి హీరోయిన్స్ లో ఒకరైన వాణిశ్రీ వయసు కూడా డెబ్భైకి పైనే ఉంటుంది.

అప్పటి హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు పొందారు.మరో సీనియర్ నటుడు శరత్ బాబు వయసు కూడా డెబ్భైకి పైనే ఉంటుంది.

అయినా కూడా ఇప్పటికి సినిమాల్లో రాణిస్తున్నారు.అదండీ సంగతి అలనాటి సీనియర్ నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుసుకున్నారు కదా.

తాజా వార్తలు