సినిమా ఇండస్ట్రీ లో హీరోస్ మాత్రమే గొంతెమ్మ కోరికలు కోరుతారు అనుకుంటారు కానీ ఇప్పుడు అయినా, అప్పుడు అయినా కూడా ఇండస్ట్రీ కి సరైన హీరోయిన్స్( Heroines ) కొరత ఉంటూనే ఉంది.కొంత మంది నటన లో బాగున్నా ఎక్సపోసింగ్ విషయంలో హద్దులు పెట్టుకుంటారు.
మరి కొందరు ఎలాంటి హద్దులు పెట్టుకోకపోతే వారికి సరిగ్గా నటించడం తెలియదు.పోనీ అన్ని ఉన్నాయంటే వారు ఎదో ఒక విషయంలో ఖచ్చితంగా ఉంటారు.
ఉదాహరకు హీరోయిన్స్ కి ఒకప్పుడు ఎంత వయసు వచ్చిన, పెళ్ళై పిల్లలు ఉన్న కూడా నటించేవారు.కొత్తవారు వచ్చిన కూడా పాతికేళ్ళకు పైగా హీరోయిన్ గా ఉండేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

అలాగే అప్పటి దర్శకులు కూడా ప్రోత్సాహం ఇచ్చేవారు.కానీ ఇప్పుడు ఒక మూడేళ్లు ఇండస్ట్రీ లో ఉంటె కష్టమే అన్నట్టు గా ఉంది పరిస్థితి.అయితే గతం లో హీరోయిన్స్ అయినా కూడా పద్ధతులకు తొలిదకాలు ఇచ్చే వారు కాదు.పూజలు, వ్రతాలు చేసుకునే వారు.కుటుంబానికి వండి పెట్టాకే షూటింగ్ కి వచ్చే వారు.ఇక అప్పటి రోజుల్లో ఎక్కువగా ఇండోర్ షూటింగ్స్ ఎక్కువగా జరిగేవి.
మద్రాసులో స్టూడియోలు కట్టి అక్కడే అనేక ఫ్లోర్స్ లో ఒకేసారి చాల సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉండేవి.అయితే కొంత కాలం తర్వాత సినిమాలు బయట ప్రదేశాల్లో కూడా షూట్ చేయడం మొదలు పెట్టారు.

అయినా హీరోయిన్స్ ఇంట్లో తల్లి, భార్య బాధ్యత నెరవేర్చాలి అనుకోని కొంత మంది అవుట్ డోర్ షూటింగ్స్ కి ఒప్పుకునే వారు కాదు.ముఖ్యంగా అంజలి దేవి( Anjali Devi ) మరియు భానుమతి( Bhanumathi ) వంటి హీరోయిన్స్ అయితే ఇండోర్ అయితేనే చెప్పండి లేదంటే లేదు అని మొహం మీదే చెప్పేవారు.ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకొని, ఇంటిని, భర్తను చూసుకుంటూ ఎదో కొన్ని సినిమాల్లో నటించిన చాలు అనుకునేవారు.అవుట్ డోర్ షూటింగ్ ఉన్న సినిమ షూటింగ్ లను ఒప్పుకోకుండా దర్శకులతో పేచీ పెట్టేవారు.
మరి ఇంత డిమాండ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని ఏళ్ళ పాటు సినిమాల్లో రాణించారు అంటూ కొంత మంది అంటుంటారు.