Super star krishna passed away : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు!

టాలీవుడ్ ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.కృష్ణ మరణవార్త తెలిసి ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.కృష్ణ తన సినీ కెరీర్ లో 340కు పైగా సినిమాలలో నటించారు.1942 సంవత్సరం మే 31వ తేదీన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించారు.కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.

 Tollywood Super Star Krishna Is No More , Tollywood , Super Star Krishna , Passe-TeluguStop.com

బాల్యం నుంచి కృష్ణ సినిమాల్లో నటించి సక్సెస్ కావాలని అనుకుని సక్సెస్ అయ్యారు.రోజుకు మూడు షిప్ట్ లలో విరామం లేకుండా పని చేసిన నటులలో కృష్ణ ఒకరు కావడం గమనార్హం.1969 సంవత్సరంలో కృష్ణ నటించిన 19 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.చాలా సంవత్సరాల పాటు ఏడాదికి పది కంటే ఎక్కువ సినిమాలు విడుదలయ్యేలా కృష్ణ ప్లాన్ చేసుకున్నారు.గత కొన్నేళ్ల నుంచి కృష్ణ సినిమాలకు దూరంగా ఉన్నారు.

Telugu Cardiac, Congress, Krishna, Rajiv Gandhi, Sri Sri Krishna, Tollywood-Movi

గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న కృష్ణ కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆస్పత్రిలో చేరారు.కొంతకాలం క్రితం కృష్ణంరాజు మృతి చెందగా ఆయన మరణాన్ని మరవక ముందే కృష్ణ మృతి చెందడం సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.తన సినీ ప్రస్థానంలో కృష్ణ చేసిన సాహసాలు అన్నీఇన్నీ కావు.దర్శకుడిగా కృష్ణ 16కు పైగా సినిమాలను తెరకెక్కించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.రాజీవ్ గాంధీపై అభిమానంతో 1984లో కృష్ణ కాంగ్రెస్ లో చేరారు.2016 సంవత్సరంలో రిలీజైన శ్రీశ్రీ కృష్ణ చివరి మూవీ.సినీ రంగానికి విశేష సేవలందించిన కృష్ణ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

గత కొంతకాలంగా కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube