టాలీవుడ్ స్టార్ హీరోలు (Tollywood stars) వృత్తి పరంగా ఎంత సీరియస్ గా ఉంటారో ఫ్యామిలీ కి కూడా ఎక్కువ ఇంపోర్టెన్స్ ఇస్తారు.సీరియస్ గా ఉంటారో ఫ్యామిలికి కూడా ఎక్కువ ఇంపోర్టెన్స్ ఇస్తారు.
మరి మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఉన్నారు.వీరిద్దరూ తెలుగులో తిరుగులేని స్టార్ డమ్ ను అనుభవిస్తున్నారు.
మరి ఈ ఇద్దరు స్టార్స్ ప్రస్థుతం తమ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలి తో ఎంజాయ్ చేయనున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ తో సమ్మర్ వేకేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తుంది.
ఈయన నిన్న ఫ్యామిలితో కలిసి విదేశాలకు చెక్కేశారు.ప్రస్తుతం పవన్ (Pawan Kalyan) చేతిలో చాలా సినిమాలు ఉన్నప్పటికి వాటికి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలి తో టైమ్ స్పెండ్ చెయ్యడానికి వేకేషన్ కు వెళ్ళాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కుటుంబ సభ్యులతో ట్రిప్ వేయబోతున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి మహేష్ కు కొంచెం బ్రేక్ రావటంతో మహేష్ కూడా రెండు రోజుల్లో విదేశాలకు వెళ్లనున్నాడని తెలుస్తుంది.

రెండు నుంచి మూడు వారాల బ్రేక్ రావటంతో ఇప్పటికే విదేశాలకు వెళ్లిన తన భార్య పిల్లలతో మహేష్ జాయిన్ కాబోతున్నాడట.ఇక పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే వినోదయ సీతం రీమేక్ షూట్ పూర్తి చేసారు.ఈ రీమేక్ సినిమా షూట్ పూర్తి కాగానే వెంటనే మరో సినిమా షూటింగ్ తో బిజీ అవుతాడు అని అంతా అనుకున్నారు.అయితే పవన్ కొద్ది సమయాన్ని తన ఫ్యామిలికి కేటాయించారు.
మరి ఈయన ఎప్పుడు వెకేషన్ నుండి ఇంటికి చేరుకుని మరో షూట్ లో పాల్గొంటారో చూడాలి.







