మరో మూడు రోజుల్లో 2023 ఏడాదిని విడిచి 2024 ఏడాది లోకి అడుగు పెట్టబోతున్నాం.దీంతో ఇప్పటి నుండే న్యూ ఇయర్ వేడుకలు( New Year Celebrations ) స్టార్ట్ అయ్యాయి.
మరి సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు కూడా ఈ న్యూ ఇయర్ వేడుకల కోసం సిద్ధం అవుతున్నారు.ఈ వేడుకల కోసం అయితే మన టాలీవుడ్ స్టార్స్ రకరకాల ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుని ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
మన స్టార్స్ ఇక్కడ వారికున్న సెలెబ్రిటీ స్టేటస్ కారణంగా బయట తిరిగే స్వేచ్ఛ లేదు.అందుకే విదేశాలకు చెక్కేస్తున్నారు.
అక్కడికి వెళ్ళిపోయి సామాన్యులులా సెలెబ్రేషన్స్ చేసుకోనున్నారు.మరి టాలీవుడ్ హీరోల్లో విదేశాలకు చెక్కేయనున్న స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.
మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన ప్రతీ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను విదేశాల్లోనే జరుపు కుంటారు.ఈసారి గౌతమ్ న్యూయార్క్ లో చదువుకోవడానికి వెళ్లడంతో అక్కడే వీరు కూడా వెళ్లి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోనున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ఫ్యామిలీతో కలిసి ఇప్పటికే ఫారిన్ వెళ్ళిపోయారు.న్యూ ఇయర్ వేడుకల తర్వాత ఇండియాకు వచ్చే ప్లాన్ తో వెళ్లారు తారక్.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కు వెళ్లిపోయారు.
అక్కడే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోనున్నారు.ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) యుఎస్ లో ఈ వేడుకలను చేసుకోనున్నారు.
ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన విజయ్ అక్కడే న్యూ ఇయర్ వేడులను జరుపుకోనున్నారు.అలాగే మిగిలిన స్టార్స్ కూడా తమ సెలెబ్రేషన్స్ ను డిఫరెంట్ గా చేసుకోవడానికి పక్క ప్లాన్ తో సిద్ధం అవుతున్నారు.