2023 సమ్మర్‌.. బూడిదలో పోసిన పన్నీరు

కాలగమనంలో 2023 సమ్మర్( 2023 Summer ) కూడా కలిసి పోయింది.సమ్మర్ సీజన్ పూర్తి అయ్యి వచ్చే వారం నుండి పిల్లల స్కూల్స్ మరియు కాలేజ్ లు ప్రారంభం కాబోతున్నాయి.

 Tollywood Star Heroes Missed 2023 Summer Details, Star Heroes, Tollywood, Virupa-TeluguStop.com

సాధారణంగా ప్రతి సమ్మర్ లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో( Tollywood ) వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు కనీసం రెండు మూడు అంతకంటే ఎక్కువ ఉండేది.కానీ ఈసారి మాత్రం విరూపాక్ష ( Virupaksha ) మాత్రమే సూపర్‌ హిట్‌ సినిమా అన్నట్లుగా నిలిచింది.

ఇతర సినిమాలు హిట్ లేకపోవడంతో యావరేజ్ గా ఉన్న విరూపాక్ష సినిమానే సూపర్‌ హిట్‌ చేశారు ప్రేక్షకులు.సినిమాకు హిట్ అయ్యే కంటెంట్‌ ఉంది.

కానీ ఆ స్థాయిలో వసూళ్లు మాత్రం ఇతర సినిమాలు పోటీ లేకపోవడం వల్లే అనడంలో నూటికి నూరు శాతం నిజం.

Telugu Tollywood, Heroes, Telugu, Theatrs, Top, Virupaksha-Movie

ఆ విషయం పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు ఈ సమ్మర్‌ ను స్కిప్‌ చేశారు.ఏ ఒక్క పెద్ద హీరో కూడా ఈ సారి సమ్మర్ విషయంపై దృష్టి పెట్టలేదు.ఎందుకు ఇలా చేశారు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అద్భుతమైన అవకాశంను వదిలేశారు అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు కూడా స్టార్‌ హీరోలకు కౌంటర్ ఇస్తున్నారు.ఒక వేళ ఈ సీజన్ లో ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు వచ్చి ఉంటే తప్పకుండా ఫలితం మరోలా ఉండేది.

Telugu Tollywood, Heroes, Telugu, Theatrs, Top, Virupaksha-Movie

ఈ సమ్మర్‌ రెండు నెలలు కూడా ఏ ఒక్క సినిమా లేక పోవడంతో ప్రేక్షకులు కనీసం థియేటర్‌ మొహం చూడని వారు చాలా మంది ఉన్నారు.ఇష్టమైన హీరోల సినిమాలు రాకపోవడంతో థియేటర్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపించని వారు చాలా మందే ఉన్నారు అనడంలో అతిశయోక్తి అసలు లేదు.సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు సాలిడ్ స్టార్‌ హీరోల కమర్షియల్‌ ఎంటర్ టైన్మెంట్స్ సినిమాలు రాలేదు.దాంతో ఈ సమ్మర్ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారిపోయింది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube