మిగతా చిత్ర పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్( Tollywood ) పరిస్థితి కాస్త భిన్నమని చెప్పవచ్చు.టాలీవుడ్ పరిశ్రమలో చాలామంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ అందులో చాలామంది హీరోలు వరుస విజయాలు సాధించలేక డీలా పడిపోతున్నారు.
ఒకటి లేదా రెండు విజయాలు అందుకున్న తర్వాత వరుసగా నాలుగైదు ప్లాపులు పడుతున్నాయి కొంతమంది హీరోలకు.ప్రస్తుతం కొంతమంది హీరోలకైతే ఇప్పుడు ఓ మంచి హిట్ బొమ్మ పడకపోతే మాత్రం వాళ్ల కెరియర్ మాత్రం ఆల్మోస్ట్ కథ కంచికే అని చెప్పవచ్చు.
ఇక ఈ లిస్టులో మన టాలీవుడ్ హీరోలు ఎవరెవరున్నారో ఒకసారి చూద్దామా.

ఈ లిస్టులో మొదటగా కింగ్ నాగార్జున( Nagarjuna ) గురించి చూస్తే.ఆయనకు ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా హిట్ తర్వాత ఒక్కసారి కూడా భారీ హిట్ లేదని చెప్పవచ్చు.దీంతో ఆయన తలమునకలలు అవుతున్నాడు.
తాజాగా రిలీజ్ అయిన ‘నా సామి రంగ'( Naa Saami Ranga ) సినిమా కూడా ప్లాప్ కాకపోయినా యావరేజ్ గా నిలవడంతో ఆయన సంసిద్ధం లో పడిపోయారు.ఈ పరిస్థితులలో ఆయనకు ఓ భారీ హిట్ పడకపోతే మాత్రం ఆయన హీరోగా కంటిన్యూ కావడం కష్టమే అనుకోవచ్చు.

ఇక ఈ లిస్టులో మరో పెద్ద హీరో విక్టరీ వెంకటేష్( Hero Venkatesh ) గా చెప్పుకోవచ్చు.గత కొన్ని సినిమాల నుంచి ఈయన హీరోగా నటించిన సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.కరోనా సమయంలో తమిళం నుంచి ‘అసురన్ ‘ అనే సినిమాను రీమేక్ చేసి ఓటిటిలో రిలీజ్ చేశారు.దీంతో ఆయనకు పెద్దగా వచ్చిందేమీ లేదు.అదేవిధంగా మలయాళ ఇండస్ట్రీలో భారీ విజయం సాధించిన దృశ్యం 2 ను కూడా రీమేక్ చేశారు విక్టరీ వెంకటేష్.అయితే ఈ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కావడంతో ఆ సక్సెస్ కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు.
ఇక అప్పటినుంచి రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయాయి.తాజాగా సంక్రాంతి రేసులో విడుదలైన సైందవ్ సినిమా( Saindhav ) భారీ డిజాస్టర్ అందుకుంది.
ఈ మధ్యకాలంలో నటించిన ఓ వెబ్ సిరీస్ కూడా అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో అది కూడా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సమయంలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ భారీ హిట్ పడకపోతే మాత్రం హీరోగా కొనసాగే పరిస్థితులు లేవనే చెప్పవచ్చు.

టాలీవుడ్ లో ఈ లిస్టులో మరో హీరో గోపీచంద్( Hero Gopichand ) గురించి మాట్లాడవచ్చు.2013లో రిలీజ్ అయిన సాహసం తర్వాత అనేక సినిమాలు రిలీజ్ అయిన కానీ.ఈయన ఒక్క విజయం కూడా అందుకోలేకపోయారు.ఇక కొద్ది రోజుల్లో గోపీచంద్ ‘భీమ'( Bheema ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాతోనైన ఆయన సక్సెస్ కావాలని కోరుకుందాం.లేకపోతే ఆయన మార్కెట్ కూడా పడిపోయే అవకాశం లేకపోలేదు.

ఈ లిస్టులో మరో హీరో సందీప్ కిషన్( Hero Sandeep Kishan ).ఈయన కూడా అనేక భారీ ప్లాప్ లు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ పడిపోయింది.తాజాగా విడుదలైన ”ఊరు పేరు భైరవకోన” సినిమా కూడా యావరేజ్ గా నిలచడంతో సందీప్ కిషన్ పరిస్థితి ఇండస్ట్రీలో అగమ్యగోచరంగా తయారైంది.