ఏ ముహూర్తాన పుష్ప సినిమా( Pushpa Movie ) విడుదల అయ్యి విజయం సాధించిందో కానీ అలాంటి మాస్ సినిమాలను ప్రేక్షకులు ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి మన టాలీవుడ్ దర్శకుడు కూడా అదే స్టైల్ ని ఫాలో అయి బొక్క బోర్లా పడ్డ ఉదాహరణలు చాలా ఉన్నాయి.పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మాస్ సినిమాలను ఆధారం చేసుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేసి ఫ్లాప్ ని మూట కట్టుకున్న సినిమాలు ఏంటి ఆ హీరోలు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దసరా

ఈ లిస్టులో కచ్చితంగా చెప్పుకోవాల్సింది అందరికంటే ముందు నాని గురించి.దసరా సినిమా లో ( Dasara Movie ) పుష్ప లో అల్లు అర్జున్ లాగానే నాని వేషధారణ ఉంటుంది.తెలుగులో ఈ చిత్రం మంచి విజయాన్ని అయితే సాధించింది కానీ నార్త్ వారికి అంతగా నచ్చలేదు.దాంతో ప్యాన్ ఇండియా స్టార్ కావాలని కలలు కన్న నాని ఆశ కూడా నెరవేరలేదు.
స్కంద

మాస్, యాక్షన్, లుక్స్ అన్ని కూడా కొత్తగా ఉండేలా రామ్ పోతినేని( Ram Pothineni ) చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఈ నటించడం సినిమా స్కంద.( Skanda ) ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేయగా నార్త్ వారికి మాత్రమే కాదు మన తెలుగు వారికి కూడా ఇది నచ్చలేదు.దాంతో రాంపోతినేని మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది.
టైగర్ నాగేశ్వర రావు

యాక్షన్ నేపథ్యంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సైతం రవితేజకు హిట్టుని ఇవ్వకపోగా పాన్ ఇండియా ఆశలను కూడా గల్లంతు చేసింది.సరికొత్త లుక్ లో, రియల్ లైఫ్ స్టోరీ తో తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ట్రై చేసినా కూడా బొక్క బోర్లా పడటం రవితేజ వంతయ్యింది.అటు నార్త్ లోనూ, ఇటు సౌత్ లోనూ ఈ చిత్రం ఎవరిని ఆకట్టుకోలేదు.
అన్ని ఆటంకాలను దాటుకొని కేవలం బన్నీ మాత్రమే పుష్ప సినిమా ద్వారా తన మేనియా ఏంటో బాలీవుడ్ కి రుచి చూపించాడు కేవలం హిట్టు కొట్టడమే కాదు బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టించాడు ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డు కూడా సంపాదించి ఇప్పుడు దానికి సీక్వెల్ ను విడుదల చేసే పనిలో ఉన్నాడు.







