రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా( Animal Movie ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విడుదలైన వారం రోజులలో ఇది రూ.355 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇంకా ఈ సినిమాకి క్రేజ్ తగ్గలేదు.
తర్వాత దేశంలోనే కాకుండా సౌత్ ఇండియాలో ఈ మూవీ చాలామందిని ఆకట్టుకుంది.అయితే ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు ఉండటం గమనార్హం.
అయినా ప్రేక్షకులు ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.ఇందుకు కారణం సందీప్ ఈ సినిమాని ఆద్యంతం రసవత్తంగా మలచడమేనని చెప్పుకోవచ్చు.
అయితే దీనిని తలదన్నే రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.అవేవో చూద్దాం.
• ఎల్‌వోసీ కార్గిల్

2003లో ఎల్‌వోసీ కార్గిల్ సినిమా( LOC Kargil ) కార్గిల్ యుద్ధం చుట్టూ తిరుగుతుంది.ఈ మూవీ రన్ టైమ్ 4 గంటల 15 నిమిషాలు.
• దాన వీర శూర కర్ణ

1997లో విడుదలైన దాన వీర శూర కర్ణ మూవీ( Daana Veera Soora Karna ) రన్ టైమ్ ఏకంగా 3 గంటల 53 నిమిషాలు ఉంటుంది.అయినా ఈ సినిమా హిట్ అయింది.సీనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.
• మేరా నామ్ జోకర్

1970లో వచ్చిన ఈ సినిమా 3 గంటల 44 నిమిషాలు పాటు సాగుతుంది.
• లగాన్: వన్స్ అపాన్ ఎ టైమ్

ఇండియన్ ఇండిపెండెన్స్ ముందు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 44 నిమిషాలు.
• నాడోడీ మన్నన్

1958లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ మూవీ “నాడోడీ మన్నన్”( Nadodi Mannan ) రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలు.
• ఆర్ఆర్ఆర్

ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్( RRR ) నిడివి కూడా 3.02 గంటలు ఉంటుంది కానీ ఎక్కడా బోర్ కొట్టదు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
• పుష్ప: ద రైస్

బన్నీ హీరోగా చేసిన “పుష్ప”( Pushpa ) మూవీ దాదాపు మూడు గంటల పాటు సాగుతుంది.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
• అర్జున్ రెడ్డి:

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) రన్ టైమ్ 3.02 గంటలు ఉంటుంది.
పైన చెప్పిన సినిమాల్లో 20-40 నిమిషాలు ఎడిట్ చేసినా సినిమాలు హిట్ అయి ఉండేవి.
కానీ సినిమాకి ఆ సన్నివేశాలు అవసరమని భావించి డైరెక్టర్లు వాటిని తొలగించచలేదు.







