చాలా రోజులుగా మనం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సినిమా షూటింగ్స్ కి చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పుకుంటూనే ఉన్నాం.అయితే సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి సంబంధం ఏముంది అని అందరూ అనుకుంటారు.
కానీ షూటింగ్స్ మాత్రం అంత సజావుగా జరగవు.అందుకే ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలను కాస్త లేటుగా తెరమీదకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకుని థియేటర్ కి రావడానికి రంగం సిద్ధం చేసుకున్న సినిమాలకు మాత్రం ఒక చిన్న మైలేజ్ దొరికే ఛాన్స్ ఉంది.అదేంటంటే సంక్రాంతి నుంచి ఒక్క సినిమా కూడా విజయం సాధించకపోవడం తో ఆకలి మీద ఉన్నారు ప్రేక్షకులు.
దాంతో ఇప్పుడు రాబోతున్న మూడు సినిమాలపై ఆ ప్రభావం పడేలా ఉంది.ఏ కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చాలు కలెక్షన్ల సునామీ కురిపించడం ఖాయం అని తెలుస్తోంది.

మార్చి 22న సామజవరగమన సినిమా తర్వాత మరో చిత్రంతో రాబోతున్నాడు శ్రీ విష్ణు.( Sri Vishnu ) ఓం బీమ్ బుష్( Om Bheem Bush ) అనే పేరుతో వస్తున్న కామెడీ భరిత సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.శ్రీ విష్ణు తో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కామెడీ పండించడానికి సిద్ధమైపోయారు.గతంలో ఈ నటులంతా సంచలన విజయాలను నమోదు చేసుకున్న వారే.దాంతో ఈ సారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంత భావిస్తున్నారు.ఇక ఆ మార్చ్ 29న సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) డిజె టిల్లు స్క్వేర్( DJ Tillu Square ) చిత్రంతో రాబోతున్నాడు.
చాలా రోజులుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

డిజె టిల్లు మొదటి పార్ట్ ఏ మేరకు విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు స్క్వేర్ చిత్రం కూడా అలాగే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని అనుకుంటున్నారు.ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఫ్యామిలీ స్టార్( Family Star Movie ) విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సినిమా ఉండనే ఉంది.ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి పూర్తి సమ్మర్ వచ్చేస్తుంది అలాగే ఎగ్జామ్స్ కూడా ముగిసిపోతాయి.
దాంతో ప్రతి ఒక్కరు విజయ్ దేవరకొండ సినిమాకి ప్లాన్ చేసుకుంటారు.ఇలా అన్ని అంశాలు ఈ చిత్రానికి కలిసి వస్తున్నాయి.
దాంతో ఈ సినిమా కూడా కలెక్షన్స్ సాధిస్తుందని అంతా భావిస్తున్నారు.ఇలా ఈ మూడు చిత్రాలు కూడా ఆ సంచలన విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దాంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చే అవకాశాలున్నాయి.