ఈ సంఘటన దాదాపు రెండేళ్ల కిందట జరిగింది.హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్,( Radisson Hotel ) దానికి అనుబంధంగా ఉన్న పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించగా మోడల్ లిషి, ఆమె సోదరి ఖుషిత ( Kushitha ) కూడా పోలీసులకు దొరికారు.
అయితే ఆ టైమ్ లో మీడియా ముందుకొచ్చిన ఖుషిత ఇచ్చిన స్టేట్ మెంట్ బాగా వైరల్ అయింది.పబ్ లో డ్రగ్స్( Drugs ) ఉన్నాయనే విషయం తమకు తెలియదని కేవలం, చీజ్ బజ్జీ తినడానికి మాత్రమే పబ్ కు వెళ్లినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
అప్పట్లో ఆ స్టేట్ మెంట్ వైరల్ అయింది.బజ్జీ తినడానికి పబ్ కు వెళ్తారా అంటూ చాలామంది నవ్వుకున్నారు.

కట్ చేస్తే, రెండేళ్ల తర్వాత అదే ఖుషిత సోదరి లిషి గణేశ్,( Lishi Ganesh ) డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయింది.ఈ సారి కూడా అదే పబ్.పార్టీ గట్టిగా జరుగుతోంది.ఎక్కడ చూసినా కొకైన్.పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఒక్కర్ని కూడా విడిచిపెట్టకుండా అరెస్ట్ చేశారు.10 మందిపై కేసులు పెట్టారు.వాళ్లలో ఒకరు మన బజ్జీ పాప లిషి కూడా.మరోసారి బయటపడిన టాలీవుడ్( Tollywood ) కనెక్షన్ డ్రగ్స్ వ్యవహారం ఎక్కడ బయటపడినా అక్కడ టాలీవుడ్ పేరు వినిపిస్తుంది.

రాడియన్ బ్లూ పబ్ వ్యవహారంలో కూడా టాలీవుడ్ పేరు వినిపించింది.రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు తయారుచేసిన ఎఫ్ఐఆర్ లో నిర్మాత కేదార్ పేరు ప్రత్యక్షమైంది.ఇతడు ఆనంద్ దేవరకొండతో గమ్ గమ్ గణేశ అనే సినిమా నిర్మించాడు.విజయ్ దేవరకొండ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా ప్రకటించింది ఈయనే.
అయితే ఈసారి కూడా ఖుషితో చెల్లెలు దొరకడంతో ఇప్పుడు కూడా బజ్జీలు తినడానికి వెళ్ళావా అంటూ నేటిజెన్లు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.