టీడీపీ – జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) సెటైర్లు వేశారు.టీడీపీ- జనసేనది పొత్తు కాదన్న ఆయన చిత్తు అని ఎద్దేవా చేశారు.
బోరున విలపిస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలను చూస్తుంటే జాలేస్తోందని తెలిపారు.
టీడీపీ – జనసేన( TDP , Janasena ) పొత్తు వలన క్యాష్ ట్రాన్స్ ఫర్ మాత్రమే జరిగిందన్న మంత్రి అంబటి తమ క్యాస్ట్ ఓట్లు ట్రాన్స్ ఫర్ కాలేదని చెప్పారు.తమ వాడు ఏదో చేస్తాడని బైకులపై తిరిగిన యువత సైతం గొల్లుమంటున్నారని వెల్లడించారు.