ఛాంపియన్స్ వార్ వన్ సైడ్.. టాలీవుడ్ విజయంలో 'ఏజెంట్' కీ రోల్!

ఇండియన్ ఆడియెన్స్ కి ఎంతో ఇష్టమైన విషయాల్లో క్రికెట్ అండ్ సినిమా ముఖ్యమైనవి అనే చెప్పాలి.ఈ రెండింటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

 Tollywood Made The Champions War One Sided With “agent” Mass Innings, Tollyw-TeluguStop.com

సినిమా అంటే ఎంత పిచ్చి ఉంటుందో.క్రికెట్ అంటే అంతే పిచ్చి ఉంది.

మరి ఈ రెండు కలయికలో చేసిందే సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ కాగా దాదాపుగా ఎన్నో ఏళ్ళు తర్వాత ఈ ఏడాది స్టార్ట్ చేసిన సీజన్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ ఏడాది స్టార్ట్ చేసిన సీజన్ లో దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల క్రికెట్ టీమ్ లు పాల్గొన్నాయి.

మరి అలాగే మన టాలీవుడ్ నుండి కూడా ఒక టీమ్ ఇందులో పాల్గొంది.ఈ టీమ్ కు యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil) సారథ్యం వహించారు.

అఖిల్ సారధ్యంలో మొదటి ఆట నుండే దూకుడుగా టీమ్ ముందుకు వెళ్తూ వస్తుంది.ఇక మొన్న కర్ణాటక టీమ్ తో శ్రీకాంత్ తనయుడు రోషన్( Roshan ), స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ల సాలిడ్ ఇన్నింగ్స్ తో ఫైనల్స్ కు చేరుకుంది తెలుగు వారియర్స్ టీమ్.

మరి ఫైనల్స్ కు చేరుకున్న తెలుగు వారియర్స్ ( Telugu Warriors )భోజ్ పూరీ ఇండస్ట్రీతో మ్యాచ్ ఆడింది.నిన్న వైజాగ్ లో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో మన టీమ్ అద్భుతమైన బౌలింగ్ మాత్రమే కాకుండా బాటింగ్ కూడా నెక్స్ట్ లెవల్లో చేయడంతో ఈ మ్యాచ్ ముందు నుండి వార్ వన్ సైడ్ అన్నట్టు మారి పోయింది.మొదటి ఇన్నింగ్స్ లో సునాయాసంగా హాఫ్ సెంచరీ చేసిన అఖిల్ మాస్ బ్యాటింగ్ తో భారీ స్కోర్ ను టాలీవుడ్ కు అందించాడు.

మరి ఈ స్కోర్ వల్ల రెండో ఇన్నింగ్స్ లో అఖిల్ క్రీజ్ లో దిగకుండానే మిగతా వాళ్ళ బ్యాటింగ్ టోన్ మ్యాచ్ విన్ అయ్యింది.నటుడు రఘు తన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్య పరిచాడు.అంతేకాదు హిడింబ అశ్విన్ బాబు కూడా బ్యాటింగ్ తో ఆకట్టు కున్నాడు.దీంతో తెలుగు వారియర్స్ (champions war) మరోసారి ఛాంపియన్ గా నిలిచింది.ఈ మ్యాచ్ లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ఉండి విజయాన్ని టీమ్ తో సెలెబ్రేట్ చేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube