తిరుగు టపా స్థాయి నుంచి పోస్టల్ స్టాంప్ వరకు ఎదిగిన రావి కొండల రావు

మామూలుగా ఎవరైనా రాజకీయ నాయకుడికి లేదా గవర్నమెంట్ ఆఫీసులలో రిక్వెస్ట్ పెడుతూ పేపర్లు సమర్పిస్తే అవి బుట్ట దాఖలవడం మనం చూస్తూనే ఉంటాం.అలాగే ఇప్పుడంటే నవలలు, రచనలు పత్రికా ఆఫీసులకు పంపించడం తగ్గిపోయింది కానీ గతంలో ప్రతి రచయిత అడ్రస్ తో సహా తన రచన పంపించేవారు.

 Tollywood Legendary Actor And Writer Raavi Kondala Rao Funny Incident Details, T-TeluguStop.com

సదరు పత్రిక ఎడిటర్ కు నచ్చితే అది ఆ పత్రికలో అచ్చు అయ్యేది.నచ్చకపోతే తిరుగు టపా లో వారికే చేరేది.

ఇలా అచ్చు అయిన తర్వాత చూసుకుని మురిసిపోయేవారు సదరు రచయితలు.దీనికి సంబంధించిన ఒక ఫన్నీ సంఘటన గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నటుడు మరియు రచయిత అయిన రావి కొండలరావు గురించి అందరికీ తెలిసిందే ఆయన తొలినాళ్ల నుంచి అనేక నాటకాల్లో నటించారు అంతేకాదు ఆయనకు రచయితగా మంచి పేరు ఉంది.రావి కొండల రావు గారు యువకుడిగా ఉన్న సమయంలో ఔత్సాహిక రచయితగా ఆయన రచనలను ఎన్నో పత్రికలకు పంపించేవారు.

అలా ప్రధాన పత్రిక ఆయన రాసిన రచనను ఎల్లప్పుడూ తిప్పి తిరుగు టపాలో పంపించేవారట.ఆయన మనసు నోచుకున్నా సరే మళ్లీ మళ్లీ కొత్తగా రాసి ఆ పత్రిక సంస్థకు పోస్ట్ చేసేవారట.

Telugu Raavikondala, Writerraavi-Movie

అలా పంతం పెరిగిపోయి మళ్లీ మళ్లీ పంపుతున్న సదరు పత్రిక తిరిగి ఆయన రచనను తిరిగి పంపించడం పట్ల బాగా విసిగిపోయారట కొండల రావు గారు.ఇలా పలుమార్లు పోస్ట్ ఇంటికి రావడం వల్ల చార్జెస్ కూడా పడేట అప్పట్లో.విసిగిపోయిన రావి కొండల రావు గారు చివరిసారిగా ఒక రచన పంపించి అలాగే తిప్పి పంపడానికి వీలుగా తన అడ్రస్ ను కూడా జోడించి పంపించారట.షరా మామూలుగా ఆ రచన తిరిగి ఇంటికి వచ్చింది.

అప్పుడు ఎంతో సంబరపడిన కొండల రావు గారు ఎడిటర్ కి ఒక ఉత్తరం రాసారట.నేను ఎన్నిసార్లు రచనలు పంపిస్తున్న అవి తిరిగి వస్తుంటే నా రచనల్లో ఏదో పొరపాటు ఉందని అనుకున్నాను

Telugu Raavikondala, Writerraavi-Movie

కానీ చివరిసారిగా మీకు చలం గారు రాసిన ఒక కథను నా దస్తూరి తో పంపిస్తే దానిని కూడా మీరు తిప్పి పంపించారు అంటే నాలో ఏ పొరపాటు లేదు అని అర్థమయింది అని, ఇక మీ పత్రికకు సెలవు నేను వేరే పత్రికలకు రాసుకుంటాను అని చెప్పారట.ఈ విషయాన్ని ఆ పత్రిక ఎడిటర్ చదివి బుట్ట దాకలు చేయకుండా తమ పత్రికలో జరిగిన సంఘటనగా రచయిత పేరుతో సహా ముద్రించడంతో అప్పట్లో ఇది వైరల్ గా మారింది.అలా తిరుగు టపా స్థాయి నుంచి పోస్టల్ స్టాంప్ గా ఆయన ఫోటో వచ్చే స్థాయి వరకు రావి కొండల రావు గారు ఎదిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube