మీ దగ్గర ఏదైనా చేతబడులు, క్షుద్ర పూజల కథ ఉందా ? అయితే ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ.వరసగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్( Tollywood ) మొత్తం విలేజ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ పై ఫోకస్ పెట్టి విజయాలను అందుకుంటుంది.
మరి రానున్న మరి కొన్ని సినిమాలు కూడా ఇదే జోనర్ లో తెరకెక్కుతుండటం విశేషం.
విరూపాక్ష
సాయి ధరమ్ తేజ్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా గా వచ్చిన విరూపాక్ష( Virupaksha ) ఈ చేతబడులు కాన్సెప్ట్ కి బలాన్ని చేకూర్చింది.
ఈ జోనర్ లో గతంలో మంచి సినిమాలు అనేకం వచ్చిన ఈ చిత్రం తర్వాతే ఈ జోనర్ కథలు ఎక్కువగా రావడం మొదలయ్యింది.
మసుద
తీరు, సంగీత, కావ్య, బంధవి ప్రధాన తారాగణంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా మసుద( masudha ).ఈ సినిమా పూర్తి స్థాయి దయ్యం స్టోరీ గా తెరకెక్కింది.ఈ చిత్రాన్ని చిన్న పిల్లలు చూడాలంటే భయపడే స్థాయిలో వచ్చి మంచి విజయాన్ని కూడా అందుకుంది.

పొలిమేర
సత్యం రాజేష్ కీలక పాత్రలో వచ్చిన పొలిమేర సినిమా( polimera movie ) సైతం ఓటిటి లో వచ్చి సూపర్ గా వ్యూస్ దక్కించుంది.ఈ సినిమా సైతం విలేజ్ మరియు సస్పెన్స్ ప్రధానంగా తెరకెక్కి విజయాన్ని దక్కించుకుంది.

పొలిమేర 2
పొలిమేర( polimera 2 ) ఓటిటి ఇచ్చిన విజయం తో దేనికి సీక్వెల్ సైతం తెరకెక్కించడం తో ఇది కూడా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతుంది.ఇక ఈ జోనర్ కి ఎలాంటి డోకా ఉండదనే విధంగా చేతబడుల కాన్సెప్ట్ మేకర్స్ బుర్రకు గట్టిగా ఎక్కించేస్తుంది.

మంగళవారం
పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో సస్పెన్స్, హత్యల కాన్సెప్ట్ తో తెరకెక్కింది మంగళవారం( mangalavaram ).ప్రతి మంగళవారం ఒక హత్య జరుగుతుండటం తో సినిమా ఆసాంతం ఆసక్తి కలిగించేలా ఉనుందని, పాయల్ సైతం మునుపెన్నడూ నటించని విధంగా బోల్డ్ గా నటించిందని అందరు చెప్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.








