అప్పుడు జోడీగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు ఆ జోఢీలే ఢీ కొట్టబోతున్నారు?

సాధారణంగా సినిమాల్లో కొంతమంది హీరో హీరోయిన్ల జోడీలు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటాయి.ఇక ఇలాంటి జోడీలు మళ్ళీ రిపీట్ అయితే బాగుండు అని ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు.

 Tollywood Jodis Now Turns Opposite Raviteja Anupama Avika Nikhil Details, Hero Heroines, Box Office Fight, Raviteja, Meenakshi Choudhary, Nikhil Siddhart, Avika Gor, Nagachaitanya, Anupama Parameswaran, Ram Pothineni, The Warrior, Thank You, Khiladi, Karthikeya 2-TeluguStop.com

కానీ ప్రేక్షకులతో వావ్ అనిపించుకున్న జోడి లో ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది అని అర్థమవుతుంది.

ఒకప్పుడు హీరోలతో కలిసి నటించిన హీరోయిన్లు ఇప్పుడు అదే హీరోలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

 Tollywood Jodis Now Turns Opposite Raviteja Anupama Avika Nikhil Details, Hero Heroines, Box Office Fight, Raviteja, Meenakshi Choudhary, Nikhil Siddhart, Avika Gor, Nagachaitanya, Anupama Parameswaran, Ram Pothineni, The Warrior, Thank You, Khiladi, Karthikeya 2-అప్పుడు జోడీగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు ఆ జోఢీలే ఢీ కొట్టబోతున్నారు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామ్ పోతినేని వర్సెస్ తమన్నా :

వీరిద్దరి కాంబినేషన్లో ఎందుకంటే ప్రేమంట అనే సినిమా వచ్చింది.ఇక ఈ సినిమాలో లవ్ స్టోరీ యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.వీరి జోడి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత వీరిద్దరీ జోడి మళ్లీ రిపీట్ కాలేదు.కానీ అప్పుడు ఒకే సినిమాలో సందడి చేసిన జోడి బాక్సాఫీసు వద్ద వేరువేరు సినిమాలతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది.

జూలై 14వ తేదీన రామ్ ద వారియర్ సినిమా రిలీజ్ కానుంది.జూలై 15వ తేదీన తమన్నా గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ అవుతుంది.

Telugu Avika Gor, Box, July Box, Karthikeya, Khiladi, Nagachaitanya, Nikhil Siddhart, Ram Pothineni, Raviteja, Warrior-Latest News - Telugu

నాగచైతన్య వర్సెస్ అనుపమ పరమేశ్వరన్ :

వీరిద్దరూ కలిసి ప్రేమమ్ అనే సినిమాలో నటించారు.2016 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.కానీ కట్ చేస్తే ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.జులై 22వ తేదీన అనుపమ నటించిన కార్తికేయ 2 విడుదలకు సిద్ధమవుతుండగా.

అదే సమయంలో చైతు థాంక్యూ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Avika Gor, Box, July Box, Karthikeya, Khiladi, Nagachaitanya, Nikhil Siddhart, Ram Pothineni, Raviteja, Warrior-Latest News - Telugu

నిఖిల్ వర్సెస్ అవిక గోర్ :

నిఖిల్ కెరీర్లో మంచి విజయాలు సాధించిన సినిమాలలో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో నితిన్ సరసన అవికా గోర్ నటించింది.ఇక వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ఈ జోడీ వేరు వేరు సినిమాల్లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది.నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా జూలై 22 వ తేదీన ఇక థాంక్యూ సినిమాతో పోటీ పడేందుకు సిద్ధమైంది అవికా గోర్.

Telugu Avika Gor, Box, July Box, Karthikeya, Khiladi, Nagachaitanya, Nikhil Siddhart, Ram Pothineni, Raviteja, Warrior-Latest News - Telugu

రవితేజ వర్సెస్ మీనాక్షి చౌదరి :

ఈ ఏడాది ఆరంభంలో ఖిలాడి సినిమాతో ఒకే సినిమాలో ఆడిపాడిన ఈ జోడి ఇక ఇప్పుడు జూలై 29 వ తేదీన పోటీ పడేందుకు సిద్ధమవుతోంది.రామారావు ఆన్ డ్యూటీ అంటూ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.అదే సమయంలో అడవి శేష్ హీరోగా నటిస్తున్న హిట్ సెకండ్ కేసు తో మీనాక్షి చౌదరి ప్రేక్షకులను పలకరించపోతుంది అని తెలుస్తుంది.ఇలా ఒకప్పుడు జోడీగా అలరించి ఇక ఇప్పుడు వేరు వేరు సినిమాలతో పోటీ పడేందుకు సిద్ధంగా అవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube