సామాన్యుడి గళం వినిపించేలా ‘జన వాణి’.ప్రజల సమస్యలను ఆసాంతం విని… ప్రభుత్వానికి బలంగా తెలిపేలా వినూత్న కార్యక్రమం.
బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్.కష్టాల్లో ఉన్న జన సామాన్యానికి జనసేన భరోసా.3వ తేదీన విజయవాడలో ‘జన వాణి’కి శ్రీకారం చుడతాం.తొలి రెండు ఆదివారాలు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జన వాణి.
పవన్ కళ్యాణ్ గారికి సమస్య విన్నవించుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది.దాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.సమస్యను చెప్పుకోవాలనుకునే ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని మా అధ్యక్షుల వారికి విన్నవించ వచ్చు.







