ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన వివాదాలు ఇవే.. వివాదాలకు చెక్ పడినట్టేనా?

2024 సంవత్సరంలో సినిమాల పరంగా గత సంవత్సరాలతో పోలిస్తే మెరుగైన సక్సెస్ రేట్ దక్కిందనే చెప్పాలి.

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో 14 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు, థియేటర్ల ఓనర్లకు మంచి లాభాలను అందించాయి.

పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాకపోయినా కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేశాయి.రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు లాభాలను అందించిన సినిమాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.

అయితే ఈ ఏడాది కొన్ని వివాదాలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని( Tollywood ) కుదిపేశాయి.ఈ ఏడాది సంచలనం అయిన వివాదాల్లో జానీ మాస్టర్( Jani Master ) వివాదం ముందువరసలో ఉంటుంది.

జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసే ఒక యువతి మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం చెలరేగింది.

Advertisement

ఈ కేసులో జానీమాస్టర్ కొన్నిరోజులు జైలుకే పరిమితమై ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు.మరో హీరో రాజ్ తరుణ్ పై( Raj Tarun ) లావణ్య( Lavanya ) అనే యువతి ఆరోపణలు చేయడంతో పాటు పలు ఆధారలను బయటపెట్టింది.ఈ వివాదం రాజ్ తరుణ్ సినిమాలపై, సినిమాల ప్రమోషన్స్ పై ప్రభావం చూపింది.

ఈ ఏడాది విడుదలైన రాజ్ తరుణ్ సినిమాలన్నీ ప్రేక్షకులకు భారీ షాకిచ్చాయనే చెప్పాలి.

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) వైసీపీ నేతకు అనుకూలంగా ప్రచారం చేయడం సంచలనం అయింది.ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది.పుష్ప2( Pushpa 2 ) పై ఈ వివాదం ఎఫెక్ట్ పడుతుందో లేదో చూడాల్సి ఉంది.టాలీవుడ్ ప్రముఖ నటి హేమ( Hema ) ఒక వివాదంలో చిక్కుకోవడం ఆ వివాదం సంచలనం కావడం జరిగింది.

ఈ కేసులో హేమ బెయిల్ పై విడుదలయ్యారు.ఈ వివాదం హేమ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.

కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?
Advertisement

తాజా వార్తలు